ఇంటింటికి త్రాగునీరు స‌ర‌ఫ‌రా ప‌థ‌కం కింద జిల్లాకు 1600 కోట్లు-మంత్రి సోమిరెడ్డి

0
159

నెల్లూరుః ఇంటింటికి త్రాగునీరు స‌ర‌ఫ‌రా ప‌థ‌కం కింద జిల్లాకు 1600 కోట్ల రూపాయ‌లు పంచాయితీరాజ్‌శాఖ ద్వారా మంజూరు చేశార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు.శుక్ర‌వారం ఇడిమేప‌ల్లి,పిడూరుపాళెం గ్రామాల్లో జ‌రిగిన జ‌న్మ‌భూమి-మావూరు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న సంద‌ర్బంలో అయన మాట్లాడుతూ ఈ ప‌ధ‌కం కింద స‌ర్వేప‌ల్లి నియోజ‌వ‌ర్గానికి 357 త్రాగునీరు ప‌నుల‌కు 92 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశామ‌న్నారు.ఈనెల 17 నుంచి టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.గ‌తం ప్ర‌భుత్వ 10 సంవ‌త్స‌రాల్లో చేసిన అభివృద్ది ప‌నుల‌ను త‌మ ప్ర‌భుత్వం కేవ‌లం3 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో చేసింద‌న్నారు.రాష్ట్ర వ్య‌ప్తంగా 5 రుబ్బ‌న్ మండ‌లాలు ఎంపిక కాగా ఒక‌టి వెంక‌టాచలం మండ‌లం కావ‌డం జిల్లాకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.రుబ్బ‌న్ మండ‌లం ద్వారా కోట్ల రూపాయ‌లు మండ‌లానికి మంజూరు అవుతాయ‌ని,అన్ని ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్న‌య‌న్నారు.వెంక‌టాచ‌లం మండ‌లం మోడ‌ల్ మండ‌లంగా రూపుదిద్దుకొంటుంద‌న్నారు.ఇడిమేప‌ల్లిలో 30 ల‌క్ష‌ల రూపాయ‌ల అంచ‌నాల‌తో చేప‌ట్టిన నీళ్ల ట్యాంకుకు శంఖుస్దాప‌న చేశారు.పిడూరుపాళెంలో నాలుగు రైతుర‌థ‌లు ల‌బ్దిదారుల‌కు అంద‌చేశారు.ఈకార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్ దేవసేన‌మ్మ‌,ఎం.పి.టి.సి వెంక‌ట‌సుబ్బ‌య్య‌,పిడూరుపాళెం స‌ర్పంచ్ సులోచ‌న‌మ్మ‌,అధికార‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY