మెట్ట‌ప్రాంత‌రైతులు-డెల్టా రైతుల‌తో స‌మానంగా సాగుచేయ‌డం గ‌ర్వ‌కార‌ణం-మంత్రి సోమిరెడ్డి

0
212

నెల్లూరుః కండ‌లేరు నుండి 62 కోట్ల రూపాయ‌ల‌తో ఏర్పాటు చేసిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా మెట్ట ప్రాంత‌మైన పొద‌ల‌కూరు మండ‌లాన్ని టి.పి.గూడూరు,ఇందుకూరుపేట‌,త‌దిత‌ర డెల్టా ప్రాంతాలతో స‌మానంగా సాగుచేయ‌డం గ‌ర్వ‌కారణ‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.ఆదివారం స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం వెంక‌ట‌చాలం మండ‌లం పాలిచెర్ల‌పాడు చెరువుకు తెలుగుగంగ నీటిని సాంప్రాదాయ‌బ‌ద్దంగా విడుద‌ల చేసినంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో అయ‌న మాట్లాడుతూ 1987 సం..గ‌త‌న ప్ర‌భుత్వాలు ముందుచూపుతో కండ‌లేరు రిజర్వాయ‌ర్‌ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని,నేడు కండ‌లేరు రిజర్వాయ‌ర్ ద్వారా 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో 274 చెరువుల ద్వారా 80 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రిగింద‌ని,దీనికి అవ‌స‌ర‌మైన 5.5 టి.ఎం.సిల నీటిని పోతిరెడ్డిపాడు రిజ‌ర్వాయ‌ర్ నుండి పొంద‌డం జ‌రిగింద‌న్నారు.
25 కోట్ల‌తో టిపిగూడూరు అభివృద్ది ప‌నులుః- ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌,,,సి.ఎస్‌.ఆర్ త‌దిత‌రల‌తో క‌ల‌పి షుమారు 25 కోట్ల 32 ల‌క్ష‌ల రూపాయ‌లతో టి.పి.గూడూరు మండ‌లానికి సంబంధించి సి.ఎస్‌. పురం మండపం ప్రాంతాల్లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.ఆదివారం టిపిగూడ‌నూరు మండ‌లం సి.ఎస్‌.ఆర్ పురంలోని మండ‌పం పంచాయితీలో రిల‌య‌న్స్ ప‌వ‌ర్ ప్లాంట్‌కు భూమ‌లుఉ అందించిన రైతుల‌కు న‌ష్ట‌పహారాన్ని అందించే కార్య‌క్ర‌మంలో అయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఎక‌రాకు 6 ల‌క్ష‌ల పైన విలువ‌తో 35 మంది రైతుల‌కు 2 కోట్ల 23 ల‌క్ష‌ల 31 వేల 929 రూపాయ‌ల చెక్కుల రూపంలో అందించ‌డం జ‌రిగింద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ఆర్‌.డి.ఓ హ‌రిత‌,వ్య‌వసాయ‌శాఖాధికార‌లు చంద్ర‌నాయ‌క్‌,త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY