రాష్ట్రంలోని మున్సిపల్ స్కూళ్లను కార్పోరేట్ కు దీటుగా నిలుపుతాం-మంత్రి నారాయణ

0
129

నెల్లూరుః రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి విద్యారాజధానిగా చేస్తామని రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ‌ మంత్రి డాక్టర్ పొంగూరు.నారాయణ అన్నారు.గురువారం నాడు రాష్ట్రంలోని మున్సిపల్ హైస్కూళ్లు, ప్రైమరీ,అంగన్ వాడీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్స్‌లో గత రెండు సంవత్సరాలుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని,ఇదే స్ఫూర్తి మరో మూడేళ్లు కొనసాగితే దేశంలోనే మున్సిపల్ స్కూళ్లు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.2018లో పదో తరగతి ఫలితాల్లో 303 మంది పిల్లలకు పదికి పది పాయింట్లు సాధించడం ద్వారా ప్రభుత్వ మున్సిపల్ స్కూళ్లు చరిత్ర సృష్టించాయని చెప్పిన మంత్రి, 2019లో 500 మందికి పదికి పది పాయింట్లు వచ్చేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, నారాయణ విద్యాసంస్థల నుండి మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారని,అలాగే మైక్రో షెడ్యూల్,పరీక్షల నిర్వహణ వంటి వాటిలో కూడా నారాయణ విద్యాసంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కావలసిన ప్రణాళిక రూపకల్పన కోసం గురువారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్విహించినట్టు మంత్రి వెల్లండించారు.ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ‌ డైరెక్టర్ కన్నబాబు,నెల్లూరు కమిషనర్ అలీంబాషా,నెల్లూరు డిఇఓ,ఉపాథ్యాయులు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY