నెల్లూరులోనే మొదటిసారిగా ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో సాఫ్ట్ వేర్-మంత్రి నారాయ‌ణ‌

0
74

నెల్లూరుః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలన్న కృతనిశ్చయంతో తాను పనిచేస్తున్నానని మంత్రి నారాయణ తెలిపారు.శుక్రవారం నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కొండ్లపూడి ముదు కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం, వారి భార్య శేషమ్మ కుమార్లు నర్సారెడ్డి ,సుధాకర్రెడ్డిలుదాతృత్వంతో ఒక కోటి ఇరవై లక్షల నిధులతో స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో తన శాఖ పురపాలక శాఖ అయినప్పటికిని తాను విద్యావేత్తగా ఎన్నో విద్యా సంస్థలను స్థాపించిన అనుభవంతో ప్రభుత్వ ఆధీనంలోని మున్సిపల్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాతాన్ని మెరుగుపర్చాలని ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో రెండు వేల స్కూళ్లు ఉన్నప్పటికీ చాలా స్కూళ్లలో విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు లేకపోవడం వల్ల కూడా విద్యాశాతం తగ్గుతున్నదని గుర్తించామన్నారు.ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తున్నామన్నారు.ఈ నెల పదిహేనో తేదీన నెల్లూరులోనే మొదటిసారిగా ఆ సాఫ్ట్ వేర్ ను ప్రీస్కూళ్ల ఉపాధ్యాయుల అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సాఫ్ట్వేర్కు సంబంధించి ఎల్సీడీ స్క్రీన్ ఇవ్వనున్నామని ఇ౦దుకుగాను పద్నాలుగు వేల రూపాయలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.గతంలో నూట పది మున్సిపల్ స్కూళ్లలో నాలుగు చోట్ల మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ఈ రోజు ఏడున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఈ నాలుగేళ్లలో మున్సిపల్ పాఠశాలల్లో విద్యాశాతం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చని దీనికి నిదర్శనమే విద్యలో తెస్తున్న మార్పులు అని గమనించాలన్నారు.

LEAVE A REPLY