ఈ నెల 10 నుండి రాజ‌రాజేశ్వ‌రి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు-మంత్రి నారాయ‌ణ‌

0
122

నెల్లూరుః ఈనెల 10వ తేది నుండ‌ది 18వ తేది వ‌ర‌కు స్దానిక రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవాస్దానంలో నిర్వ‌హించ‌నున్న 44వ దేవి శ‌ర‌న్న‌వరాత్రి మ‌హోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ అధికారుల‌ను అదేశించారు.సోమ‌వారం నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజ్‌లోని క్యాంపు కార్యాల‌యంలో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని దేవాదాయ‌,న‌గ‌ర‌పాల‌క సంస్ద‌,పోలీసు,విద్యుత్‌,వైద్య ఆరోగ్య‌,రోడ్లు భ‌వ‌నాలు,అగ్నిమాప‌క‌శాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.అంత‌కు ముందు అయ‌న శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌క సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు. ఈకార్య‌క్ర‌మంలో నూడా ఛైర్మ‌న్ శ్రీనివాసుల‌రెడ్డి,ఆర్‌.డి.ఓ చిన్నికృష్ణ‌,క‌మీష‌న‌ర్ అలీంబాషా,దేవాదాశాఖ క‌మీష‌న‌ర్ శ్రీనివాస‌రెడ్డి,విజ‌య‌డైరీ ఛైర్మ‌న్ కొండ్రెరెడ్డి.రంగారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY