గ్రామీణ ప్రాంతాల్లో 2 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు కేవ‌లం ఒక్క డాక్ట‌రు-మంత్రి నారాయ‌ణ‌

0
23

నెల్లూరుః వైద్య వృత్తిలోకి రానున్న వైద్య విద్యార్దులు కొంత కాలం గ్రామీణ ప్రాంతాల్లో ప‌నిచేయాల‌ని పురపాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ సూచించారు.శుక్ర‌వారం నెల్లూరు ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల వార్షికోత్స‌వంలో హాజ‌రైన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ప్ర‌తి వెయ్యి మంది ప్ర‌జ‌ల‌కు ఒక డాక్ట‌రు ఉండాల‌ని,కాని మ‌న దేశంలో ప్ర‌తి 1600 మందికి ఒక డాక్ట‌రు ఉన్న‌ర‌న్నారు.దేశంలో 10 ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లులో ప్రాక్టీస్ కేవ‌లం 8 ల‌క్ష‌ల మంది ఉండ‌గా,వారిలో కూడా 80 శాతం మంది వైద్యులు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న‌ర‌ని,గ్రామీణ ప్రాంతాల్లో 2 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు కేవ‌లం ఒక్క డాక్ట‌రు మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ర‌ని తెలిపారు.వార్షికోత్స‌వ స‌భ‌లో స్దానిక డాక్ట‌ర్లు ప్ర‌స్తావించిన స‌మస్య‌ల‌పై మంత్రి సానుకూలంగా స్పందిస్తు,త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ‌సుప‌త్రిలో వైద్యుల కొర‌త అధిగ‌మిస్తామ‌ని తెలిపిన మంత్రి ఏసి లెక్చ‌ర్‌హాల్స్ సెమినార్ హాల్స్‌,అడిటోరియలు ముఖ్య‌మంత్రితో చ‌ర్చించి ఏర్పాటు చేస్తామ‌న్నారు.అలాగే స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం 50 ల‌క్ష‌లు,లైబ్ర‌రీకి కావ‌ల‌సిన 6000 పుస్త‌కాల‌ను ఏర్పాటు చేయ‌డానికి మంత్రి సంసిద్ద‌త వ్యక్తం చేశారు.ఈకార్య‌క్ర‌మంలో హాస్పిట‌ల్ అభివృద్ది క‌మిటీ ఛైర్మ‌న్ చాట్ల‌.న‌రసింహ‌రావు,ప్రిన్సిప‌ల్‌,అధ్యాప‌కులు,కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY