విఆర్ స్కూల్, కాలేజీల్లో పది సంవత్సరాలు చదువుకున్నా-మంత్రి నారాయ‌ణ‌

0
130

నెల్లూరుః విఆర్ స్కూల్, కాలేజీల్లో పది సంవత్సరాలు చదువుకున్నానని,నెల్లూరు పౌరుడిగా నెల్లూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటే,ఇందులో కూడా ప్రతిపక్ష నేతలు తప్పులు వెదుకుతున్నారని రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రూ పొంగూరు.నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.బుధ‌వారం పట్టణంలోని విఆర్ కళాశాలను సందర్శించిన అంన‌తరం మంత్రి విద్యార్దుల‌తో మాట్లాడుతూ నేను పుట్టి ఉరుకు ఎంతోకొంత చేయాలన్నఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాని,దేశంలో విద్యకు నెల్లూరు చిరునామాగా చేయాలన్నది త‌న‌ కోరికన్నారు.ప్రతి పక్షాల విమర్శలకు భయపడే వాడిని కానని,ఏ ప‌నిని అయిన మాటల్లో కాక, చేతల్లో చూపడం నాకు అలవాటన్నారు.ఈ రాష్ట్రంలో నా విద్యాసంస్థలకు నష్టం వచ్చినా భ‌రించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని,ఇతర రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు బాగా అభివృద్ధి బాటలో ఉన్నాయన్నారు. పేదరికం రూపుమాపాలంటే విద్యే ప్రధాన ఆయుధమ‌ని,అందుకే విద్య మీద ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీలను కార్పోరేట్ కు దీటుగా తయారు చేస్తాన‌ని హామీ ఇచ్చారు.రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుతో మంచి ఫలితాలు సాధించామ‌ని,ఈ సంవత్సరం పది పాయింట్లు సాధించిన వారి సంఖ్య 500% పెరిగిందని,49 మందితో ప్రారంభించిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి సత్ఫలితాలిస్తోందని తెలిపారు.గురుకుల కళాశాలల్లో కూడా 43 మంది ఐఐటి మెయిన్స్ కు అర్హత సాధించారని,ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మొత్తం 44 కళాశాలల్లో స్పెషల్ ప్రోగ్రామ్ నిర్విహిస్తున్నామ‌ని, నారాయణ మెటీరియల్‌ను ఈ కళాశాలల విద్యార్ధులకు అందిస్తున్నమని చెప్పారు.

LEAVE A REPLY