దేశంలో అత్యుత్త‌మ వైద్య‌శాల‌గా సిమ్స్‌ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం-మంత్రి కామినేని

0
104

చిత్తూరుః దేశంలో ఎక్కడ లేనివిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో వంద డయాలసిస్ యంత్రాలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు అత్యాధునిక వైద్యపరికరాలతో వైద్యసేవలను అందిస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ అన్నారు.సోమ‌వారం తిరుపతి పట్టణంలోని మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్ధ (స్విమ్స్) ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు స్విమ్స్ ఆసుపత్రిని స్థాపించి నేటికి 25సంవత్సరాలు పూర్తయ్యాయని,స్విమ్స్‌లో అత్యాధునిక వైధ్య సేవలు అందించడం వలన ఓపి గణనీయంగా పెరిగిందన్నారు.రాయలసీమ ప్రజలకు వరప్రధాయనిగా మారిందని,స్విమ్స్ ఆసుపత్రి, యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వైద్యశాలగా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా ప‌నిచేస్తున్న‌మ‌న్నారు.గుండెవ్యాధిగ్రస్తులకు అత్యవసర వైద్యసేవలను అందించడం కోసం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సహకరంతో స్విమ్స్ లో అంతర్జాతీయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ ద్వారా డెంగీ, స్వైన్ ప్లూ తో పాటు పలు రకాల వ్యాధులకు రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్న‌మ‌ని తెలిపారు.ఈకార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుగుణమ్మ,ఎమ్మెల్సీ రాజనర్సింహులు,తూడ చైర్మన్ నర్సింహయాదవ్, స్విమ్స్ ఆసుపత్రి సంచాలకులు టి.ఎస్.రవికుమార్, ఏపీ మెడికల్ బోర్డు చైర్మన్ రాజరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY