ఏపీకి దిశాదశ చంద్రబాబు ఒక్కడే-మంత్రి దేవినేని ఉమా

0
116

అమ‌రావ‌తిః తెలుగు రాష్ర్టాలైన ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దులతో పాటు, తెలుగు ప్రజలందరికీ గుర్తుండేలా విజయవాడలో జరుగుతున్న 37వ మహానాడు తెలుగుదేశం పండుగను విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.శుక్రవారంనాడు జలవనరుల విడిది కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ నాయకులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సుమారు 104 లబ్దిదారులకు సుమారు రూ.50లక్షల నిధులను ఆయన అందజేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృష్ణాజిల్లాకు చెందిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుడిగా పనిచేసి మూడురోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు పండుగను తెలుగు ప్రజలందిరికీ గుర్తుండేలా విజయంతం చేద్దామన్నారు.ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మైలవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు,కార్యకర్తలు సభా ప్రాంగణానికి వెళ్లి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మైలవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా సునాయస విజయం తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేసారు. మైలవరం నియోజకవర్గానికి ఎల్లలు తెలియని వాళ్ళు, నియోజకవర్గ సమస్యలపై, ప్రజల జీవన విధానంపై అవగాహన లేనివాళ్లు డబ్బు మదంతో ఎన్నికల్లో గెలవాలనుకోవటం పగటికలగా ఆయన అభివర్ణించారు.నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు ప్రత్యర్థి పార్టీ నాయకునికి దిమ్మతిరిగేలా గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

LEAVE A REPLY