నెల్లూరు జిల్లా రైతులు చ‌రిత్ర సృష్టించారు-సోమిరెడ్డి

0
60

నెల్లూరుః నెల్లూరు జిల్లా రైతులు దేశంలోనే అగ్రగామిగా నిలిచార‌ని,వారిని ఆద‌ర్శంగా తీసుకొని మిగిలి జిల్లా రైతులు వ్య‌వ‌సాయంలో మెళ‌కువ‌లు తెలుసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖమంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.మంగ‌ళ‌వారం మ‌నుబోలు మండ‌లంలోని అక్కంపేట గ్రామంలో పొలం పిలుస్తోంది కార్య‌క్ర‌మానికి పాల్గొని మాట్లాడుతూ ఈజిప్టు దేశంలో ఒక హెక్టారుకు 8.900 కిలోలు పండిస్తుండ‌గా, నెల్లూరు జిల్లాలో 8.600 కిలోలో హెక్టారుకు పండించి నెల్లూరు రైతులు చ‌రిత్ర సృష్టించార‌న్నారు.ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల ద్వారా అందిస్తున్న రాయితీల‌ను సద్వినియోగం చేసుకొని మంచి దిగుబ‌డులు,ఆదాయం సాధించాల‌న్నారు.ఈసంద‌ర్బంగా వ్య‌వసాయ‌, ఉద్యాన‌శాఖఅధికారులు రైతుల‌కు విత్త‌న శుద్దిపై ఆవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌యోగాత్మ‌కంగా వివ‌రించారు.రైతుల‌కు భూసార ప‌రీక్ష కార్డులు పంపిణీ చేశారు. ఈకార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్ నాప‌రెడ్డి.అధికారులు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY