ఉద్యాన‌వ‌నం రైతుల‌కు ఎంత మొత్తం సబ్సిడి రుణాలకైన ప్ర‌భుత్వం సిద్దం-సోమిరెడ్డి

0
63

నెల్లూరుః జిల్లాలో రైతుల‌కు అగ్రిక‌ల్చ‌ర్‌,హ‌ర్టిక‌ల్చ‌ర్‌,సెరిక‌ల్చ‌ర్‌,క్రాపులోను,ట‌ర్మ్‌లోనులు కింద ఈ సంవ‌త్స‌రం రూ.7198 కోట్ల రుణాలు ఇవ్వాల‌ని స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ కమిటీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకొవ‌డం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు.మంగ‌ళ‌వారం స్దానిక క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆవ‌రణంలోని గోల్డెన్‌జూబ్లీహాల్‌లో వ్య‌వ‌సాయ అనుబంధ‌శాఖ‌లు,ఎస్సీ,ఎస్టీ,బి.సి,మైనార్టీ కార్పొరేష‌న్లు,బ్యాంక‌ర్ల‌తో నిర్వ‌హించి స‌మీక్షా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ 2017-18 సంవ‌త్స‌రంలో దీర్గ‌,స్వ‌ల్ప‌కాలిక రుణాలు 100 శాతం మంజూరు ల‌క్ష్యం సాధించ‌డం జ‌రిగింద‌న్నారు.జిల్లాలోని రైతులు కేవ‌లం వ‌రిసాగుకే ప్రాధ‌న్యం ఇవ్వ‌కుండా బిందు,తుపంర్ల సేద్యం చేయడానికి ముందుకు రావాల‌న్నారు.ఉద్యాన‌వ‌న పంట‌ల వైపు మొగ్గు చూపే రైతుల‌కు సబ్సిడి రుణాలు ఎంత మొత్తంలో అయిన మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్దం వుంద‌న్నారు.ఆద‌ర‌ణ‌-2 కింద 18 వేల 75 మందికి 30 కోట్ల 39 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిక‌రాలు పంపిణీ చేయ‌డానికి ఈనెల 14 నుండి 19 వ‌ర‌కు సెల‌క్ష‌న్లు జ‌రుగుతాయ‌ని తెలిపారు.ఈ స‌మావేశంలో ఏజెసి-2 క‌మ‌ల‌కుమారి,ప్రసాద్‌,అధికారులు,బ్యాంక‌ర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY