దోపిడీకి అలవాటైన వైకాపా నేతలు అదే ఆలోచనలో ఉన్నారు-మంత్రి సోమిరెడ్డి

0
75

చంద్రన్నబీమాపరిహారం,సి.ఎంసహాయనిధి చెక్కుల పంపిణీ
నెల్లూరుః పత్రిక ఉంది కదా అని సీఎం కుర్చీపై ఆశతో ఏదంటే అది రాయడం సరికాదని,రాష్ట్రం నాశనమైపోతే చూసి సంతోషించాలనే కోరికతో పత్రికకు,పార్టీ నాయకులుకు ఉంద‌ని,ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్‌రెడ్డి వైసిపి నాయ‌కులకు హిత‌వు ప‌లికారు.శ‌నివారం తోట‌ప‌ల్లి గూడూరు మండ‌ల ప్ర‌జాప‌రిషత్ కార్యాల‌యంలో బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ఫించ‌న్లు పంపిణీ చేసిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ఉదయాన్నే సాక్షి పత్రిక చదివితే మతి పోయే పరిస్థితి వస్తోందని, ప్రశాంతత కోసం చేసుకున్న ధ్యానం కూడా వృథా అవుతుందన్నారు.దోపిడీకి అలవాటైన వైకాపా నేతలు అదే ఆలోచనలో ఉన్నారని, బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం సరికాదని,రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా జరుగుతున్నఅభివృద్ధి,పారదర్శకంగా అమలవుతున్న పథకాలు సాక్షి పత్రికకు కనిపించవా అంటు ప్ర‌శ్నించారు..
నీరు-చెట్టు పథకంలో పనులు రైతుల నేతృత్వంలోని నీటి సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంటే దుష్ప్రచారం చేయడం దుర్మార్గమ‌న్నారు.గత జన్మభూమిలో జిల్లాకు 20 వేలు పింఛన్లు మంజూరు కాగా సర్వేపల్లికి 2 వేలు వచ్చాయని, ప్రస్తుతం జిల్లాకు 17 వేలు మంజూరు కాగా సర్వేపల్లికి 1748 తెచ్చామని,మిగిలిన 800 పింఛన్లను కూడా త్వరలోనే మంజూరు చేయిస్తామ‌ని,రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తునన్నారు.2014కి ముందు ముత్తుకూరు మండలంలో నెలకు 4,739 మందికి 11,21,000 రూపాయలు పింఛన్ గా ఇచ్చేవారని, ప్రస్తుతం 5,568 మందికి నెలకు 59 లక్షల రూపాయలు ఇస్తున్నామ‌ని చెప్పారు.ఏ శాఖ పరిధిలోని అభివృద్ధి లెక్క తీసుకున్నా పదేళ్లలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేశామ‌ని, పేద కుటుంబాలకు బీమా చేసిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వానిదేన‌ని తెలిపారు.చంద్రన్న బీమా,చంద్రన్న పెళ్లికానుక వంటి వినూత్నమైన చరిత్రలో నిలిచిపోయే పథకాలు అమలు చేస్తున్నమ‌ని,ప్ర‌భుత్వం చేస్తున్న ప‌థ‌కాలు చూసి ఓర్వ‌లేక‌,ప్ర‌తిప‌క్షం క‌డుపుమంటతో ఆస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

LEAVE A REPLY