నేత కార్మికులకు త్వరలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు-మంత్రి సోమిరెడ్డి

0
9

బీజేపీ విజయం స్చచ్ఛమైనది కాదు.
నెల్లూరుః గాంధీజీ బాటలో నడుస్తూ శాంతియుత జీవనం గడపడానికి నేత కార్మికులు మారుపేరని,చేనేత కార్మికులంటే త‌మ‌కు ఎంతో గౌరవమ‌ని,చేనేతల సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.మంగ‌ళ‌వారం స్దానిక గాంధీబొమ్మ సెంటర్లో చేనేత ఐక్యవేదిక దీక్షలోనాయ‌కుల‌ను ప‌ర‌మ‌ర్శించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూఐక్యవేదిక ప్రతినిధులు నా దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటిని రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్‌లో ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తాన్నారు. వీలైనంత త్వరలోనే చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాంమన్నారు.అనంత‌రం కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అయ‌న మాట్లాడుతూ
బీజేపీ విజయం స్చచ్ఛమైనది కాదుః- ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు కాద‌న్నారు.222 సీట్ల ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని,కర్ణాటకలో ఎన్నికల కోసం రూ.10,500 కోట్లు ఖర్చుపెట్టారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) సర్వే తేల్చిందన్నారు.130 కోట్ల మంది ప్రజలు బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆర్‌.ఎస్.ఎస్‌ ప్రతినిధులు అందరూ కర్ణాటకలో తిష్ట వేసి గెలుపుకోసం ప్రాకులాడేర‌ని విమ‌ర్శించారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని తుడిచివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.వేల కోట్లు ఖర్చుపెట్టి మొన్న త్రిపుర ఇప్పుడు కర్ణాటకలో అదే రాజకీయం చేస్తుంద‌ని, మిగిలిన పార్టీలకు ఎవరైనా ఆర్థికసాయం చేస్తే ఐటీ దాడులు చేయించి బెదరగొట్టిన నైజం బీజేపిద‌న్నారు.ఎంత చేసినా కర్ణాటక ప్రజలు బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని, కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లతో పోలిస్తే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కూడా తక్కువేన‌న్నారు.ప్ర‌సుత్తం ఎన్నికలు జరిగింది ఒక్క కర్ణాటకలోనే అని 2019లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయిని అప్పుడు బీజేపీ ఆటలు సాగవన్నారు.మోదీ, అమిత్ షాల వైఖరిని దేశప్రజలందరూ గమనిస్తున్నారని,వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.వేదికపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీనాయ‌కులు శ్రీనివాసులురెడ్డి,కిలారి వెంకటస్వామి,చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY