పొద‌ల‌కూరు మండ‌లాన్ని డెల్టా కింద మార్చి స‌స్య‌శ్యామలం చేస్తాం-సోమిరెడ్డి

0
99

నెల్లూరుః జిల్లాలో నీరు-చెట్టు కింద చేప‌ట్టిన ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కోరారు.సోమ‌వారం కండ‌లేరు నుండి పొద‌ల‌కూరు వ‌ర‌కు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురైన తాగునీటి పైప్‌లైన్ ప‌నులు,పొద‌ల‌కూరు చెరువు వ‌ద్ద జ‌రుగుతున్న నీరు చెట్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు.అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పొద‌ల‌కూరు మండ‌లం 14 గ్రామాల‌కు కండ‌లేరు నుండి నీరు అందించేంద‌కు స‌మ‌యం ప‌డుతున్నందు వ‌ల్ల త‌న స్వంత నిధులు 4 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేసి రిపేర్లు చేప‌డుతున్న‌మ‌న్నారు. పొద‌ల‌కూరులో 4.50 కోట్ల‌తో మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ఏర్పాటుకు టెండ‌ర్స్ పిల‌చ‌మ‌న్నారు.గ్రామ ప్ర‌జ‌ల‌కు కార్డులు అంద‌చేస్తామ‌ని,కార్డు చూపించిన వారికి 20 లీట‌ర్లు మంచినీర అంద‌చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.అలాగే పొద‌ల‌కూరు మండ‌లంలో 46 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఓవ‌ర్ హెడ్ ట్యాంకు నిర్మాణ చేప‌ట్టామ‌ని, త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌న్నారు.పొద‌ల‌కూరు మండ‌లాన్ని డెల్టా కింద మార్ప‌చేసి స‌స్య‌శ్యామలం చేస్తామ‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ప్ర‌తిప్ర‌తినిధులు,అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY