సర్వేపల్లి ఎమ్మెల్యే నిత్యం నోటికొచ్చినట్టు మాట్లాడం సిగ్గుచేటు-మంత్రి సోమిరెడ్డి

నెల్లూరుః నేను రైసు మిల్లర్ల వద్ద లంచం తీసుకున్నానని సర్వేపల్లి ఎమ్మెల్యే నిత్యం నోటికొచ్చినట్టు మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని,జిల్లాలో మూడు రైసుమిల్లర్ల అసోసియేషన్లు ఉన్నాయని,మీకు దమ్ముంటే ఒక్క అసోసియేషన్ తో చెప్పించండి అంటు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స‌వాల్ విసిరారు.సోమ‌వారం మనుబోలు మండలం మడమనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంత‌రం అయ‌న మాట్లాడుతూ నేను కాని రైసు మిల్లర్ల వద్ద లంచం తీసుకుని రైతులకు నష్టం చేసివుంటే నా కుటుంబం నాశనమైపోతుందని,నేను ఆ తప్పు చేసివుంటే నన్ను, నా కుటుంబాన్ని క్షమించవద్దని భగవంతుడిని కోరుతున్నాన అన్నారు.దుర్మార్గమైన భాషతో నిత్యం నోరుపారేసుకోవడం సర్వేపల్లి ఎమ్మెల్యేకి తగదని,ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు.ఒక ఎమ్మెల్యే ఇంత అసహ్యంగా ప్రవర్తించడం దురదృష్టకరంమ‌ని,మీ చరిత్రలో ఎప్పుడైనా రైతులకు ఉపయోగపడే పని చేశారా అంటు నిల‌దీశారు.డేగపూడి-బండేపల్లి కాలువ మంజూరుకావడాన్నిఓర్చుకోలేకపోతున్నారని,అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేయ‌డం సిగ్గుచేట‌న్నారు.ఈ నెల 25వ తేదీ నాటికి 105 కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నమ‌ని,ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1770 పుట్టికి రూ.15,045 వంతున చెల్లిస్తున్నమ‌ని,మార్కెట్ లో రూ.16 వేలు నుంచి రూ.17 వేలు వరకు పలుకుతోందన్నారు .ఎన్ని పుట్ల ధాన్యాన్ని అయినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నమ‌న్నారు.ఎవరో చెబితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమ‌ని,2010 నుంచి ఏ ప్రభుత్వ హయాంలో ఎంత ధాన్యం కొనుగోలు చేశామో అధికారిక రికార్డులు చెబుతున్నాయన్నారు.