ప్ర‌తిపక్షాలు మొస‌లి క‌న్నీరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు-మంత్రి నారాయ‌ణ‌

0
79

అభివృద్ది ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది
నెల్లూరుః నేడు రాష్ట్ర ప్ర‌జలు గుర్తుంచుకునే విధంగా గృహాప్ర‌వేశాలు నిర్వ‌హిస్తున‌మ‌ని,ఒక్క నెల్లూరు జిల్లాలో 19,200 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామ‌ని,2022 నాటికి రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదని లక్ష్యాన్ని ముఖ్యమంత్రిగారు నిర్దేశించారని రాష్ట్ర పురపాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ అన్నారు.గురువారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 వ డివిజన్లో ఎన్టీఆర్ సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ నేటికి నిరుపేదల సొంతింటి కల సాకారమైందని,ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్నసొంత ఇళ్ళను చూసి లబ్ధిదారుల ఆనందానికి హద్దుల్లేవని చెప్పారు.రాష్ట్రంలోని మునిసిపాలిటీలు పరిధిలో 2093 వార్డుల్లోను,12,767 గ్రామపంచాయతీలలోను 3లక్షల గృహప్రవేశాలను నిర్వహించామ‌న్నారు.పేదలు సొంతంగా నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వాలు 2.5 లక్షలు సహాయం చేస్తుందని,ఐటిడిఎ పరిధిలోని ఎస్టి గృహాలకు 50,000 మైదాన ప్రాంతంలోని ఎస్టి గృహాలకు 25,000 అదనంగా చెల్లించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని,గత ప్రభుత్వ కాలంలో 14.4 లక్షల ఇళ్లు అత్యంత నాసిరకంగా కట్టారు,దీనివల్ల 4200 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విష‌యం వారికి గుర్తు లేదా అని నిల‌దీశారు.గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో నిర్మించి ఇళ్ల‌లో ఒక్క నెల్లూరులోనే 4600 ఇళ్లు రేపో,మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని దీనికి ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఏం స‌మాధానం చెపుతార‌న్నారు.పేదలకు కూడా సంపన్నులతో సమానంగా నాణ్యమైన ఇల్లు నిర్మించాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోందని,ప్ర‌తిప‌క్ష‌ల ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా,అభివృద్ది ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ల‌బ్దిదారుల‌తో పాటునాయకులు,అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY