వైకాపా ప్ర‌స్తుతం ఐ.సి.యులో ఉంది-మంత్రి లోకేష్‌

0
81

దొంగ‌బ్బాయి,దొంగ పేప‌ర్‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాతలు రాస్తాడుఅమ‌రావ‌తిః వైకాపా ప్ర‌స్తుతం ఐ.సి.యులో ఉంది,వైకాపాకు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసిన‌ట్లేన‌ని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా.లోకేష్ వ్యాఖ్యనించారు.రెండ‌వ రోజు అయిన సోమ‌వారం మ‌హానాడు వేదిక‌పై నుండి అయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో తామ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు చూసి ఓర్వలేక ప‌నికి రాని ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ర‌ని మండిప‌డ్డారు.దొంగ‌బ్బాయి,దొంగ పేప‌ర్‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాతలు రాస్తాడ‌ని, ప్ర‌తిప‌క్ష‌ల‌న్ని క‌ల‌సి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కుట్ర చేస్తున్న‌య‌ని ఆరోపించారు.కులాలు,మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌య‌న్నారు.తిరుమ‌ల వెంక‌న్న జోలికి వ‌స్తే పుట్ట‌గ‌తులు వుండ‌వ‌ని హెచ్చ‌రించారు. ఉపాధిహామీలో దేశంలో మొద‌టి స్దానంలో ఉంద‌ని,తాగునీటి స‌మ్య‌ల ప‌రిష్కారానికి 20 వేల కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. రాబోయే 6 నెలల్లో ఇంటింటికి కుళాయి ఇచ్చేందుకు బాధ్య‌త తీసుకున్న‌మ‌న్నారు.త్రాగునీటి స‌ర‌ఫ‌రాలో ఎక్క‌డ అవినితి తావులేకుండా చేశామ‌న్నారు.సిమెంట్‌రోడ్లు,అంగ‌న్‌వాడీభ‌వ‌నాలు,పంచాయితీ భ‌వ‌నాలు నిర్మించామ‌న్నారు.లింక్‌రోడ్ల‌కు 6 వేల కోట్లు కేటాయించిన ఘ‌న‌త తెలుగుదేశం పార్టీకే ద‌క్కుతుందన్నారు.ప‌ల్లేకు సేవా చేస్తే ప‌ర‌మాత్ముడికి సేవా చేసినట్లున‌ని, ప్ర‌తిప‌క్ష‌లు ఆరోప‌ణ‌లు త‌న‌పై ఆరోప‌ణలు చేస్తున్న‌య‌ని,సాక్ష్య‌ధార‌ల‌తో రుజువు చేయాల‌ని స‌వాల్ విసురుతునన్న‌రు.త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే తిప్పికొట్టాల్సిన బాధ్య అంద‌రిపై వుంద‌న్నారు.రాష్ట్రబివృద్దికి సి.ఎం రాత్రిప‌గ‌ళ్లు క‌ష్టప‌డుతున్నారు.పార్టీ కార్య‌క‌ర్త‌ల కోసం సంక్షే నిధి ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY