హార్డ్‌వేర్‌,ఎల్‌క్ర్టానిక్స్ రంగానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కేరాఫ్ ఆడ్ర‌సు-లోకేష్‌

0
42

అమ‌రావ‌తిః రాబోయే రోజుల్లో 2 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న‌ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని,20 శాతం సెల్‌ఫోన్‌ల‌ను రాష్ట్రంలోనే అసెంబ్లింగ్ చేస్తున్న‌ర‌ని ఐటి,పంచాయితీరాజ్‌శాఖ‌మంత్రి నారా.లోకేష్ తెలిపారు.మంగ‌ళ‌వారం ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీతో ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో ఏపి ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకున్న సంద‌ర్బంలో అయ‌న మీడియాతో మాట్లాడారు.దాదాపు 580 కోట్ల రూపాయ‌ల‌తో ఈ కంపెనీ ప్లాంట్‌ను శ్రీసిటి సెజ్‌లో ప్రారంభించ‌నున్న‌ద‌ని,కంపెనీ ద్వారా దాదాపు 6.600 వేల‌ మందికి ఉద్యోగాలు వస్తాయ‌న్నారు.అలాగే హార్డ్‌వేర్‌,ఎల్‌క్ర్టానిక్స్ రంగానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కేరాఫ్ ఆడ్ర‌సుగా మార‌నుంద‌న్నారు.ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్పిస్తున్న‌మ‌న్నారు.

LEAVE A REPLY