త్వ‌ర‌లో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్,అకాడ‌మీలు-మంత్రి కొల్లు

0
101

నెల్లూరుః ఆరోగ్యంతోపాటు మాన‌సిక వికాసం,చైత‌న్యవంత‌మైన స‌మాజానికి క్రీడ‌లు దోహ‌దం చేస్తాయ‌ని క్రీడ‌లు,యువజ‌న శాఖ మంత్రి కొల్లు.ర‌వీంద్ర అన్నారు.శుక్ర‌వారం స్దానిక ఏసిస్టేడియంలో 2 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌నున్న రీజ‌న‌ల్ అకాడ‌మి భ‌వ‌నానికి,మ‌రో 2 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌నున్న వికాస్ కేంద్రాల‌కు మంత్రి నారాయ‌ణ‌తో క‌ల‌సి శంఖుస్దాప‌న చేశారు.మీడియా స‌మావేశంలో మంత్రి కొల్లు.ర‌వీంద్ర మాట్లాడుతూ జిల్లాలో మొగ‌ళ‌ల‌పాళెంలో కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన 8 కోట్ల రూపాయ‌ల‌తో 150 ఎక‌రాల్లో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ‌నులు జ‌రుగుతున్న‌య‌న్నారు.అక్క‌డే 250 కోట్ల రూపాయ‌ల‌తో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో వివిధ క్రీడల‌కు సంబంధించి అకాడ‌మీలు ప్రారంభిస్తామ‌న్నారు.అలాగే జిల్లాలో జిమ్‌ల ఏర్పాటుకు 140 కోట్ల‌తో డి.పి.ఆర్ త‌యారు చేస్తున్న‌ర‌న్నారు.న‌గ‌రంలో 16 మునిసిపాలిటీ పాఠ‌శాల్లో క్రీడ‌ప‌రిక‌రాలు,మాగుంట‌లేఅవుట్‌లో 3 కోట్ల‌తో క్రీడ వికాస్ కేంద్రాల ఏర్పాట్లకు చ‌ర్య‌లు తీసుకుటుంన్న‌ట్లు వెల్ల‌డించారు.ఏ.సి స్టేడియంలో స్కేటింగ్ ఏర్పాటుకు 7.5 కోట్ల రూపాయ‌లు ప్ర‌ణాళిక రూపొందించ‌మ‌ని అధికారుల‌ను కోరినట్లు తెలిపారు.జిల్లాలోని 10 నియోజ‌వ‌ర్గాల్లో 2 కోట్ల వంతున క్రీడ‌వికాస్ కేంద్రాలు సిద్దం చేస్తామ‌ని చెప్పారు.మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో క్రీడ‌భివృద్దికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అయ‌న వివ‌రించారు.ఈకార్య‌క్ర‌మంలో నూడాఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి,క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు,మేయ‌ర్ అజీజ్‌,క‌మీష‌న‌ర్ అలీంబాషా త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY