ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై న్యాయపోరాటానికి సిద్దం-మంత్రి కాల్వ‌

0
77

అమరావ‌తిః ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలో శుక్ర‌వారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జ‌రిగింద‌నిమంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు నిర్ణయించామని అన్నారు.సమాచార రంగంలో ఏళ్ల తరబడి సేవలందిస్తోన్న పాత్రికేయులకు గృహ వసతి కల్పనకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. తాము ఇప్పటికే ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, గృహ నిర్మాణశాఖకు రూ.1,480కోట్ల అదనపు బడ్జెట్‌ కేటాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు.ఆక్రమణకు గురికాబ‌డి అభ్యంతరాల్లేని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు.విశాఖపట్నంలో ప్రపంచస్థాయి క్రీడానగరం కోసం భూసమీకరణకు మంత్రిమండలి అనుమతినిచ్చిందని అన్నారు.దేశంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (IREP) నిర్మాణ బాధ్యతలను గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంద‌న్నారు.కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో వెయ్యి మెగావాట్ల సామర్ధ్యంతో సౌర విద్యుత్, 550 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పవన విద్యుత్, 1200 మెగావాట్ల సామర్ధ్యం వున్న స్టాండ్ ఎలోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీస్‌ను గ్రీన్‌కో ఏర్పాటు చేస్తుందన్నారు.

LEAVE A REPLY