టెట్ పరీక్షలో 57.48 శాతం అర్హత సాధించారు-మంత్రి గంటా

0
100

విశాఖపట్నంః విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(AU)లోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విడుదల చేశారు.ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా, 3,70,573మంది పరీక్షకు హజరయ్యారని,ఇందులో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.ఈ పరీక్షలో 57.48 శాతం అర్హత సాధించార‌న్నారు.
పేపర్‌-1లో 69.36 శాతం, పేపర్‌-2ఏ సోషల్‌లో 45.1 శాతం, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27శాతం, పేపర్‌ 2బీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.పేపర్‌ 1 – వేమన కుసుమ, కృష్ణా జిల్లా 146 మార్కులు పేపర్‌ 2ఏ హిందీ – అచ్చుకుట్ల గౌసియా, కడప, 142 మార్కులు పేపర్‌ 2ఏ సోషల్‌ స్టడీస్‌ – ఆర్ల విష్ణుప్రియ, ఒంగోలు, ప్రకాశం జిల్లా 136 మార్కులు పేపర్‌ 2ఏ మాథ్స్ అండ్‌ సైన్స్‌ – ఇమంది విజయలక్ష్మి, విజయ నగరం 135 మార్కులు పేపర్‌ 2ఏ – పాతకోకల బేబీ షాలిని పశ్చిమ గోదావరి, 135 మార్కులు పేపర్‌ 2ఏ తెలుగు – చింతపల్లి లావణ్య, నెల్లూరు, 134 మార్కులు పేపర్‌ 2ఏ ఇంగ్లిష్‌ – ఎం ప్రభాకర్‌ బాబు, గుంటూరు 138 మార్కులు పేపర్‌ 2బీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ – పాముల వేణుగోపాల్‌, చిత్తూరు 135 మార్కులు పేపర్‌ 2బీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ – షేక్‌ షంషుద్దీన్‌, కృష్ణా, 135 మార్కులు సాధించార‌ని తెలిపారు.

LEAVE A REPLY