అమిత్ షా స్క్రిప్ట్ లో కమెడియన్ జగన్-లోకేష్‌

0
125

అనంత‌పురంః వైసీపీ ఓ డ్రామా కంపెనీ,,, ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్క్రిప్ట్ లో కమెడియన్ జగన్, నటులు వైసీపీ ఎంపీలని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా.లోకేశ్ వ్యంగంగా వ్యాఖ్యినించారు. బుధ‌వారం అనంతపురం జిల్లాలోని గుండుమల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్నిప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌పార్టీ అధినేత జ‌గ‌న్‌,పార్టీ నాయ‌కుల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలవారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.ప్ర‌భుత్వం చేప‌డుతూన్న అభివృద్ది కార్య‌క్ర‌మాలు చూసి ఓర్వ‌లేక ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ర‌ని,ఇలాంటివి ప్ర‌జ‌లు న‌మ్మేస్దితిలో లేర‌న్న సంగతి ప్ర‌తిప‌క్ష‌పార్టీలు గుర్తుంచుకోవాల‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ప‌ల్లె.ర‌ఘునాథ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY