ప్ర‌భుత్వం చేసిన అభివృద్ది ఫలితాలు అందరికీ కనబడుతున్నాయి-చంద్ర‌బాబు

0
59

అమ‌రావ‌తిః రాష్ట్ర అభివృద్ది కొసం ప్రతి ఒక్కరిలో నవనిర్మాణ స్ఫూర్తి ఉండాలి,మనలో పట్టుదల మరింత పెరగి, కసితో అభివృద్ధి వైపు సాగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.సోమ‌వారం మూడో రోజు దీక్షల నిర్వహణపై విజయవాడలోని తన నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి వెళ్లినప్పుడు పది మందిని కలవాలని, గ్రామస్తులను చైతన్య పరచి, ప్రజల భాగస్వామ్యం పెంచే బాధ్యతలను సాధికార మిత్రలు తీసుకోని, ఏ అంశంపై చర్చ ఉందో ఆ వర్గం ప్రజలను అధిక సంఖ్యలో భాగస్వాములను చేయాలన్నారు.68 చెరువులు నీటితో నింపడం సంతృప్తినిచ్చిందిః-పత్తికొండ,ఆలూరు నియోజకవర్గాలలో చెరువులు నీళ్లులేక ఎండిపోయాయి.రూ.280కోట్లు ఖర్చుచేసి హంద్రీ-నీవా ద్వారా చెరువులను నీటితో నింపామ‌ని, నిన్న 68 చెరువులను నీటితో నింపడం సంతృప్తినిచ్చిందని,మనం చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయన్నారు.ప్ర‌భుత్వం చేసిన‌ ఫలితాలు అందరికీ కనబడుతున్నాయని, అందుకే ప్రజల్లో సంతృప్త స్థాయి 78% వచ్చిందన్న‌రు.4 సంవ‌త్స‌రాల్లో చేసిన పనులు చెప్పండి. ప్రజల్లో మరింత సంతృప్తి పెంచండని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.టెలికాన్ఫరెన్స్ లో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, రియల్ టైం గవర్నెన్స్ ఎండీ అహ్మద్ బాబు, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY