అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు,ఆయాల‌కు వేత‌నాలు పెంచిన ముఖ్య‌మంత్రి

0
75

అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అంగన్ వాడీ టీచర్లకు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని తన నివాసంలో ని ప్రజాదర్బార్ హాలులో సాధికార మిత్రలతో బుధ‌వారం సమావేశం జరిగింది.ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ,రూ.7,500 ఉన్న అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.10,500కు, రూ.4,500 గా ఉన్న ఆయాల వేతనాలను రూ.6,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే అంగన్ వాడీల వేతనాలను రెండోసారి పెంచామని చెప్పారు. అంగన్ వాడీలకు వేతనాలు పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్లకు పైగా భారం పడుతుందని అన్నారు. అంగన్ వాడీలందరికీ త్వరలోనే స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందని, చిన్నపిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు.

LEAVE A REPLY