విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలన్నింటిని నేరవేర్చ‌డంలో కేంద్రం విఫ‌లం-ముఖ్య‌మంత్రి

0
70

అమ‌రావ‌తిః రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 4 సంవ‌త్స‌రాలు అయిన కేంద్ర ప్రభుత్వం విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నేర‌వేర్చ‌డంలో విఫ‌లంమైనందునే,జూన్ 2వ తేదిన‌ రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ వేడుకలు స‌మంజ‌సం కాద‌ని న‌వ‌నిర్మాణ‌దీక్ష చేస్తున్న‌మ‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.శ‌నివారం విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ప్రసంగిస్తూ పోల‌వ‌రం ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌ల జీవ‌నాడి అని,కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయిన రాష్ట్రమే 55 శాతం ప‌నులు పూర్తిచేసింద‌న్నారు.విభ‌జ‌నతో పూర్తిగా న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌న వంతు స‌హ‌కారం అందిస్తానాని నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ న‌మ్మ‌పలికాడ‌ని,అమ‌రావ‌తి శంకుస్దాప‌న స‌మ‌యంలో వ‌చ్చి చెంబుడు నీళ్లు,గుప్పెడు మ‌ట్టి ఇచ్చిపోయార‌ని అన్నారు.అప్ప‌టికి కేంద్రం నుండి స‌హ‌క‌రం అందుతుంది ఏమో అని వేచి చూసినప్ప‌టికి ఫ‌లితం లేక పోవ‌డంతో,ప్ర‌త్యేక‌హోదాతో పాటు విభ‌జ‌న హామీల‌ని నేర‌వేర్చ‌ల‌ని డిమాండ్ చేస్తు,కేంద్ర మంత్రివ‌ర్గం నుండి బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింద‌న్నారు.విశాఖ‌ప‌ట్నం రైల్వేజోన్ ఇవ్వ‌కుండా పక్క రాష్ట్రల‌ను సాకుగా చూపి,రైల్వేజోన్ ఏర్పాటు చేయ‌కుండ,కేంద్రం త‌ప్పించుకుంటుంద‌ని ఆరోపించారు.కేంద్రం విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలన్నింటిని నేరవేర్చ‌వ‌ర‌కు ధ‌ర్మ‌పోర‌టా చేస్తామ‌న్నారు.

LEAVE A REPLY