కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

0
48

అమరావతిః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న గురువారం స‌చివాల‌యంలో రాష్ట్ర కేబినెట్ స‌మావేశం సుధీర్ఘం జ‌రిగింది.ఈ స‌మావేశంలో మంత్రి మండ‌లి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది.ముఖ్యాంశాలు ఇలా వున్నాయి……
రాష్ట్రంలో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో 203 అన్న క్యాంటీన్లను నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 71 పట్టణాలు, సీఆర్‌డీఏ పరిధిలోనూ వీటిని నిర్మిస్తారు.అల్పాహారం, భోజనం ఏదైనా రూ. 5కు ఇవ్వాలని నిర్ణయించింది.బీపీఎల్ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే నిమిత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కందిపప్పును కొనుగోలు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కిలో రూ.40 ధరకు నెలకు 2 కిలోల చొప్పున అందించేందుకు నిర్ణయం.ఇందుకు అవసరమైన రూ.131 కోట్ల రాయితీని పౌర సరఫరాల శాఖకు అందించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త పాలసీతో ప్రోత్సాహం.ఒక్కో ఎం-పార్కులో రూ. 225 కోట్ల పెట్టుబడులు, 1500 మందికి ఉద్యోగాలు వచ్చేలా 150 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. రాష్ట్రం మొత్తంమీద 200 ఎం-పార్కులు ఏర్పాటు చేసి 30 వేల ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా చూడటం ద్వారా రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉద్యోగాల కల్పన పాలసీతో సాధ్యపడుతుంది. ఇ-రిక్షా, ఇ-కార్డు, ఇ-ఆటోలకు జీవిత పన్ను మినహాయింపు.ఆంధ్రప్రదేశ్ మోటర్ వెహికల్స్ టాక్సేషన్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ 2018’కు మంత్రిమండలి ఆమోదం.బ్యాటరీ ఆధారంగా నడించే ఇ-రిక్షాలు, ఇ-కార్టులు, అలాగే నలుగురు ప్రయాణించే ఆటో రిక్షాలకు, 3 టన్నుల సామర్ధ్యం మించని తేలికపాటి సరుకు రవాణా వాహనాలకు ప్రస్తుతం అమలవుతున్న జీవిత పన్ను పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ 1963’ దీనిని పొందుపరుస్తారు. రవాణా శాఖ, వాహన యజమానికి ఉపయుక్తంగా వుండేలా త్రైమాసికం లేదంటే ఏడాదికి ఒకసారి పన్ను చెల్లించేలా వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది.ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-23’కి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32 మంది సర్వీసును క్రమబద్దీకరించడానికి మంత్రిమండలి ఆమోదం.రాష్ట్ర వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రూ.1000 కోట్ల రుణానికి గాను ప్రభుత్వం హామీని మరో ఏడాదిపాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.జీవిత ఖైదు అనుభవిస్తున్న 49 మంది ఖైదీలను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది.ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ రూ. వెయ్యి కోట్ల రుణాన్ని పొందడానికి ప్రభుత్వం హామీగా వుండాలని మంత్రిమండలి నిర్ణయం. జలవనరుల శాఖలో 34 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.చీఫ్ ఇంజినీర్ 1, సూపరెంటిండింగ్ ఇంజినీర్ 14, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 19 పోస్టులు.ఎ.పి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME’s) డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల్లో కొన్ని తాత్కాలిక పోస్టుల మంజూరు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం. రెవెన్యూ డిపార్టుమెంట్‌లో 392 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగుల పోస్టులకు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌ పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రిమండలి ఆమోదం.జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలును సమీక్షించేందుకు, పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ లో 7 తాత్కాలిక పోస్టులను భర్తీకి మంత్రిమండలి అనుమతి.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో వివిధ పట్టణాలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.12,600 కోట్ల మంజూరుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి ఆమోదం.1.నీటి సరఫరా 2.మురుగునీటిపారుదల 3.మరుగుదొడ్ల నిర్వహణ 4 వర్షపు నీటి పారుదల 5. రోడ్లు, రోడ్లకు మరమ్మతులు 6. స్మశానాలు 7. పార్కుల వ్యవస్థ మెరుగుదలకు ఈ నిధులు వెచ్చిస్తారు.ఇందులో 90% జాతీయ బ్యాంకుల నుంచి , రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% ఈక్విటీ కింద సమకూరుస్తారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం వెయ్యి ఎకరాల వాటర్ బాడి ల్యాండ్ అప్పగించేందుకు డైరెక్టర్ అఫ్ పోర్ట్స్, కాకినాడకు అనుమతిచ్చిన మంత్రిమండలి.అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్ట్ అప్ ఏరియాను అభివృద్ధి కోసం ఏడీపీకి ఏపీ సి ఆర్ డీ ఏ పవర్ అఫ్ అటార్నీ ఇచ్చేందుకు మంత్రిమండలి అనుమతి.
రాజమండ్రి క్లస్టర్ లో వ్యర్ధాల నుంచి ఇంధనం తయారు చేసే యూనిట్ ఏర్పాటుకు ఒకే బీడ్ దాఖలు చేసిన మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ను ఎంపిక చేస్తూ మంత్రిమండలి నిర్ణయం.తూర్పుగోదావరి జిల్లాలోని వి. సవరం-రాయవరం మధ్య జడ్పీపీ రహదారిని నిర్మించుకునేందుకు వీలుగా ప్రైవేటు వ్యక్తులు దగ్గర సేకరించిన 1.28 ఎకరాల భూమికి బదులుగా అంతే విస్తీర్ణంలో భూమిని బదలాయించేందుకు మంత్రిమండలి అంగీకారం.

LEAVE A REPLY