ప్రింట్,ఎలక్ట్రానిక్,సోషల్ మీడియా ప్రచారంతో-చంద్ర‌బాబు

0
87

అమ‌రావ‌తిః 2019 ఎన్నికల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిన‌ అవసంర మనకు ఎంతైనా ఉందని, ప్రభుత్వంపై ప్రతిపక్షలు చేస్తున్నవిమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలు,కార్యకర్తలంతా జాగ్రత్తగా పని చేయాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు పనులను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని,.పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు 22 వేల మంది ప్రజలు సందర్శించారని,ఒక్క ప్రాజెక్టు కోసం ఇంతగా కష్టపడుతుండటం దేశంలో మరే ప్రాజెక్టు ఇంత ప్రాధ‌న్య‌త ఇవ్వ‌డం లేదన్నారు.మీ అందరికీ నా నుండి ఎప్పుడైనా ఫోన్ రావచ్చని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కొంచెం కఠినంగా ఉండక తప్పదని, తాను చెప్పేది వింటే వ్యక్తిగతంగా చెపుతానని, వినని వారికి ప్రజల్లోనే చెపుతానని హెచ్చరించారు.ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందని, వాటిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా,మౌత్ ప్రచారంతో ముందుకు సాగాలని కోరారు.ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని,దానికోసం ఎంతైనా కష్టపడాలన్నారు.సోషల్ మీడియాలో ప్రతి నాయకుడు యాక్టివ్ గా ఉండాలని హితబోధ చేశారు. రానున్న 6 నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు.యూనివర్శిటీల్లో ఉన్న 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని చెప్పారు.సేవా మిత్రలు,సాధికార మిత్రలతో ముఖాముఖి మాట్లాడతానని,నాయకులపై కార్యకర్తలకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి 45 రోజులకు ఒకసారి సేకరిస్తామని చెప్పారు. ప్రతి నాయకుడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితో సత్సంబంధాలను కొనసాగించాలని ఆదేశించారు.

LEAVE A REPLY