నా క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించే దమ్ము ఎవరికైనా ఉందా-చ‌ంద్ర‌బాబు

0
86

అమ‌రావ‌తిః రాష్ట్రనికి న్యాయం చేయమని అడిగితే వేరే వారితో (వైసీపీ) కలిసి మాపై కుట్రలు చేస్తారా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాని ప్రశ్నించారు.కుట్రలు,కుతంత్రాలు త‌న ద‌గ్గ‌ర సాగవని ఎన్డీఏని హెచ్చరిస్తున్నానని అన్నారు. విజయవాడలో జరుగుతోన్న మహానాడులో మంగ‌ళ‌వారం ముగింపు ప్రసంగం చేసిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.బీజేపీ చేస్తోన్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టే మా తమ్ముళ్లున్నారు,చెల్లెళ్లున్నర‌ని,తెలుగు దేశం పార్టీ కుటుంబం ఉంది.నేను ఎవరికీ భయపడే అవసరం లేదన్నారు.నేను 5 కోట్ల ఏపీ ప్రజలకు మాత్రమే భయపడతా వారి కోసమే ఆలోచిస్తా ప్రతిరోజు కొందరు నాపై,,రాజధానిపై విమర్శలు చేస్తున్నారు.నీతివంతమైన పాలన అందిస్తున్నందుకే విమర్శలు చేస్తున్నారా? అని నేను అడుగుతున్నాను.తన క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? అని అయ‌న ప్రశ్నించారు.తాను 40 ఏళ్ల నుంచి ఎంతో క్రమశిక్షణతో, విశ్వసనీయతతో ఉన్నానని,భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని,ఎక్కడా చిన్నతప్పు జరగకూడదని భావిస్తూ ముందుకు వెళుతున్నానని చెప్పారు.40 ఏళ్లుగా తనపై చాలామంది ఎన్నో ఆరోపణలు చేశారని,ఒక్క ఆరోపణని కూడా నిరూపించలేకపోయారన్నారు.తాను నమ్ముకున్న సిద్ధాంతాలు, శ్రమ వల్లే ఈ స్థాయికి వచ్చానని అన్నారు.

LEAVE A REPLY