రాష్ట్ర అభివృద్దికోసం ప్ర‌తినిత్యం విద్యార్దినే-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయ‌డు

0
148

నెల్లూరుః ఎవ‌రు ఎన్ని అడ్డంకులు క‌ల్పించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావతిని ప్ర‌పంచ‌స్దాయి రాజ‌ధానిగా తీర్చిదిద్దుతామ‌ని,రాష్ట్రంలో న‌దులను అనుసంధానం చేసి ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందేలా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తునట్లు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా.చంద్ర‌బాబునాయుడు చెప్పారు.శుక్ర‌వారం న‌వ‌నిర్మాణ‌దీక్ష ముగింపు కార్య‌క్ర‌మంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట‌లో ALCM Grounds నిర్వ‌హించిన మ‌హాసంక‌ల్ప ప్ర‌తిజ్ఞ‌నంత‌రం అయ‌న మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత రెవెన్యూ బ‌డ్జెట్ లోటు 16 వేల కోట్ల రూపాయులు వున్న‌ప్ప‌టికి రైతులకు రుణ‌మాఫీ కింద్ర 24 వేల కోట్లు,డ్వాక్రామ‌హిళ సంఘ‌ల‌కు 8 వేల రూపాయ‌ల వంతున మాఫీ చేసిన ఘ‌న‌త తెలుగుదేశంపార్టీకే సొంత‌మ‌న్నారు.పాల‌న ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికి ప్ర‌జ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎలాంటి లోటు లేకుండా నిధులు స‌మ‌కురుస్తున్న‌మ‌న్నారు.రాష్ట్రనికి జీవ‌నాడి అయ‌న పోల‌వ‌రం నిర్మాణం పూర్తి కాకుండా కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన,55 శాతం ప‌నులు పూర్తి చేశామ‌న్నారు.వ్యవ‌సాయ‌రంగంతో పాటు ఆక్వారంగం అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.6 నుండి 14 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వున్న పిల్ల‌లంతా పాఠ‌శాల్లో వుండాల‌ని,అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌మ‌న్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి పాఠ‌శాల్లో డిజిట‌ల్ క్లాస్‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌మ‌ని,విద్యార్దులు ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్ళెందుకు ప్ర‌భుత్వ ఆర్దిక స‌హయం అంద‌చేస్తుంద‌న్నారు.ఎస్సీ,ఎస్టీ,బి.సి,మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కొత్త ప‌ధ‌కాలు ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.ఏ.పి ఫైబ‌ర్ నెట్‌ను 200 ఛాన‌ల్స్‌,,50 ఎం.బి.పి.ఎస్‌తో క‌నెక్ష‌న్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని,ప్ర‌స్తుత‌నికి 3 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్స్ ఇచ్చామ‌ని,డిశంబ‌ర్ నాటికి రాష్ట్రంలో కోటి క‌నెక్ష‌న్స్ ఇచ్చి,వీడియోకాన్ప‌రెన్స్ ద్వారా ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడుతాన‌న్నారు.వ్య‌వ‌సాయం,ఆరోగ్యం,విద్య,వినోదం లాంటి అన్ని సేవాలు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.ప్ర‌తినిత్యం ఎదో ఒక‌టి నేర్చుకోవాల‌న్న సంక‌ల్పం ఉన్న‌వారు ఏదైన సాధిస్తార‌ని,తాను రాష్ట్ర అభివృద్ది కోసం ప్ర‌తినిత్యం విద్యార్దిగానే ఉంటాన‌న్నారు.నిరుద్యోగ‌భృతి ఇస్తామ‌ని,డ్వాక్ర‌సంఘ‌లు,నిరుద్యోగుల క‌ల‌సి రాష్ట్రన్ని విజ్ఞ‌న గ‌ని మార్చేందుకు ముందుకు రావ‌ల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.అంద‌రికి ఉపాధి క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌మ‌ని,ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్‌లో రాష్ట్ర ముందుంద‌న్నారు.

LEAVE A REPLY