పోలవరంపై 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించిన-చంద్రబాబు

0
103

అమరావతి: పోలవరం పనులను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా పోలవరం పనుల పరిశీలిస్తున్నమని,పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 56.90% శాతం పూర్తి చేసినట్లుగా పోలవరంపై 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.అమ‌రావ‌తిలో వెల‌గ‌పూడిలోనరేగా నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం సోమవారం సమీక్షలో, శాఖలవారీగా, వారంవారం లక్ష్యాలను నిర్దేశించుకుని పనులను పూర్తిచేయాలని సూచించారు.సీసీ రహదారులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటివరకూ 56.90% శాతం పూర్తయినట్లు తెలిపారు.ఏఏ పనులు ఏఏ మేరకు అయ్యాయో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా శాతాలలో వివరించారు. తవ్వకం పనులు 76.60%, కాంక్రీట్ పనులు 31.60%, కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.41%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు.ఈ సందర్భంగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయమై అమ‌న‌ మాట్లాడుతూ ప్రాజెక్టుల పరిశీలనకు త్వరలో వస్తాన‌ని, పనుల్లో జాప్యాన్ని సహించని హెచ్చరించారు.అలాగే ఆగస్టు కల్లా అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేసి, ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. సంగం-నెల్లూరు బ్యారేజ్‌లను నిర్దేశిత సమయానికి నిర్మించాలని,తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలన్నారు.వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా అనుసంధానం తొలిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు.

LEAVE A REPLY