అధికారుల్లో అంకిత భావాల్ని పెంపొందించ‌డంమే క‌మిటి ఉద్దేశం-గొల్ల‌ప‌ల్లి

0
79

శాస‌న‌స‌భ ప్రభుత్వ హామీల క‌మిటి
నెల్లూరుః బాధ్యతాయుత పాల‌నను అందించ‌డం,అధికారుల్లో అంకిత భావాల్ని పెంపొందించ‌డంమే శాస‌న‌స‌భ ప్రభుత్వ హామీల క‌మిటి ల‌క్ష్య‌మ‌ని అంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ప్ర‌భుత్వ‌హామీల క‌మిటి అధ్య‌క్ష‌డు గొల్ల‌ప‌ల్లి.సూర్యారావు అన్నారు.మంగ‌ళ‌వారం నూత‌న జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో జ‌రిగిన ప్ర‌భుత్వ‌హామీల క‌మిటి స‌మావేశంలో అయ‌న అధికారుల‌నుద్దేశించి మాట్లాడుతూ శాస‌న‌స‌భలో ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల గురించి గ్రామాల్లో ప్ర‌జ‌లు నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తార‌ని,వారి ఆశ‌యాల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం ప‌నిచేయాల్సివుంటుంద‌న్నారు.క‌మిటి స‌భ్యుడు నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ అనేక కార‌ణాల‌వ‌ల్ల అన్ని హామీల పూర్తిచేయ‌డంలో అవాంతరాలు ఎదురువుతున్న‌య‌ని,వాటిని అధిక‌మించి అధికారులు ప‌నిచేయాల‌న్నారు.అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు మాట్లాడుతూ వివిధ హామీలు పూర్తిచేయ‌డంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చ‌ర్యల‌ను వివ‌రించారు.గ‌తంలో శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం ఇచ్చిన పాఠ‌శాల‌ల ఆద‌న‌పు గ‌దులు మంజూరు,నెల్లూరు టి.బి అసుప‌త్రి అధునీక‌ర‌ణ‌,ఇళ్ల స‌ముదాయానికి మౌలిక వ‌స‌తులు క‌ల్పన‌,ఈ సేవా కేంద్రాలు,విమాన‌శ్ర‌యం ఏర్పాటు,పెన్నాబ్యారేజ్‌నిర్మాణం,మోపిదేవి వంతెన నిర్మాణం త‌దిత‌ర హామీల‌పై స‌భ్యులు అధికారుల నుండి వివ‌ర‌ణ‌లు తీసుకున్నారు.ఈ స‌మావేశంలో క‌మిటి అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ రాజ‌కుమార్‌,సెక్ష‌న్ ఆఫీస‌ర్ కుమార‌స్వామి,డి.ఆర్‌.ఓ వెంక‌ట‌సుబ్బ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY