సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్‌పై ఆర్దిక నేరాల కేసు న‌మోదు

0
141

ప‌రారీలో టిడిపి నేత గరిక.ఈశ్వరమ్మ
నెల్లూరుః సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ నాయకురాలు గరిక.ఈశ్వరమ్మ క్యామిల్ కో అపరేటివ్ మహిళా సొసైటీ పేరుతో పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తామంటూ నాబార్డు,S.B.Iనుండి ఈశ్వరమ్మ రూ.9.21 కోట్లు రుణం తీసుకొని తిరిగి సకాలంలో చెల్లించక రూ.7.08 కోట్లు ఎగవేసినట్టు సంబంధిత‌ వ‌ర్గాల అధికారులు ఫిర్యాదు చేయ‌డంతో గురువారం కేసు న‌మోదు చేశామ‌ని,ప్ర‌స్తుతం అమె ప‌రారీలో వుంద‌ని సూళ్లూరుపేట సి.ఐ తెలిపారు.
స్దానికుల క‌థ‌నంః-పేద మ‌హిళ‌ల‌కు రుణ‌లు ఇప్పిస్తామంటు స్టేట్ బ్యాంక్‌ను దగా చేసి ఈశ్వ‌ర‌మ్మ‌పరారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలియ‌చేసిన‌ప్ప‌టికి,జిల్లా సహకార శాఖాధికారులు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టారు.గరిక ఈశ్వరమ్మ పై ఆర్థిక నేరాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి,ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.వెంటనే అధికారపార్టీ నాయకుడు,నియోజకవర్గ ఇంచార్జి పోలీసులకు ఫోన్ చేసి అమెను వెంటనే ఇంటికి పంపాలని హుకుం జారీ చేయడం తో ఆమెను పోలీసులు ఇంటికి పంపారు.అక్కడ నుండి వైస్ చైర్మన్ ఈశ్వరమ్మ పరారైంది. సూళ్లూరుపేట పోలీసులు వైస్ చైర్మన్ ఆచూకీ కోసం గాలిస్తు,ఆమెకు అనుకూలమైన వారిని కొంతమంది ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వైస్ చైర్మన్ దొరికేంతవరకు వీరంతా పోలీస్ స్టేషన్ లోనే ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

LEAVE A REPLY