జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ముఖ్య*మంత్రులు* ముప్పేట దాడి.!

0
183

అమ‌రావ‌తిః ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అధికార ప‌క్షం ముప్పేట దాడిని ప్రారంభించిన‌ట్లు క‌న్పిస్తుంది.ఇందుకు ఒక ర‌కంగా చెప్పలంటే,ఇటీవ‌ల జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుండి మ‌ద్దుతు వ‌స్తున్న‌ట్లు క‌న్పిస్తున్న నేప‌ధ్యంలో,అధికార ప‌క్షం, జ‌గ‌న్ అవినితి ఆస్త్రంగా చేసుకుని దాడి మొద‌లెట్టిన‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.తొలుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దేశంలో ఎక్క‌డ అయిన అవినితికి సంబఃంధిచిన కేసులు బ‌య‌ట‌కు వ‌చ్చిన అందులో జ‌గ‌న్ పేరు విన్పిస్తుద‌ని,ఇలాంటి ప్ర‌తిప‌క్ష నేత రాష్ట్రంలో ఉండ‌డం,రాష్ట్ర అభివృద్దికి అడ్డంకిగా మారుతుందంటు తీవ్రంగా విమ‌ర్శించారు.జ‌గ‌న్ ప‌ట్ల చంద్ర‌బాబు స్పందించి తీరును గ‌మ‌నించిన రాష్ట్ర మంత్రులు,వారి వారి ప‌రిధిలో మీడియా స‌మావేశ‌లు పెట్టి మ‌రి జ‌గ‌న్‌పై మాట‌ల దాడి తీవ్ర‌త‌ను పెంచారు.ఈనేపథ్యంలో శుక్ర‌వారం నాడు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ దేశంలోని టాప్‌10 అవినితి ప‌రుల జాబిత‌లో,జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వుండ‌డం చూస్తుంటే,అయ‌న అవినితి ఏ స్దాయిలో ఉందో ఆర్ధం చేసుకొవ‌చ్చ‌న్నారు.అలాగే శ‌నివారం విజ‌య‌వాడ‌లో బారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమా మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్ట్ వ్య‌యం పెరిగేందుకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కార‌ణ‌మ‌ని,దివ్యంగ‌త నేత వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణించే స‌మ‌యానికి,జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప‌నులకు కొత్త టెండ‌ర్లు వేశార‌ని ,దినిపై తాము ప్ర‌శ్నిస్తే,స‌మాధాన‌లు చెప్పాకుండా దాట‌వేస్తున్న‌ర‌ని అరోపించారు.పట్టిసీమపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయని అన్నారు.అయితే వైసిపి నాయకులు ప‌ట్టిసీమ‌పై బుర‌ద‌చ‌ల్లుతున్న‌ర‌ని,ఇలాంటి ప్ర‌చారం రాష్ట్ర అభివృద్దికి విఘాతం క‌లిగిస్తుంద‌న్నారు.ఇదే స‌మ‌యంలో నెల్లూరులో పుర‌పాల‌క శాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ప్ర‌జ‌లు ఎప్పుడో తిర‌స్క‌రించార‌ని,అయితే ప్ర‌తిప‌క్ష స‌భ్యులుగా నిర్మాణ‌త్మ‌క‌మైన పాత్ర పోషించకుండా,ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డ‌మే ప‌నిగ పెట్టుకున్న వైఎస్ఆర్‌సిపికి నంద్యాల్లో వ‌చ్చిన ఉపఎన్న‌క‌ల్లో,ప్ర‌జ‌లు మ‌రోసారి స్ప‌ష్ట‌మైన తీర్పుతో స‌మాధ‌నం చెప్పార‌న్నారు.రాబోయే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పార్టీ పూర్తిగా తుడిపెట్టుకుని పోతుంద‌ని జోస్యం చెప్పారు.ఇలా టిడిపి అధినేత నుండి మంత్రుల వ‌ర‌కు దాడిని తీవ్రం చేస్తు,జ‌గన్‌కు పాద‌యాత్ర వ‌ల్ల మైలేజ్ వ‌స్తే,దానిని పూర్తిగా తుడిచివేసేందుకు బాట‌లు వేసుకుంటున్న‌ట్లు క‌న్పిస్తుంది,మ‌రి అధికార పార్టీ వ్యుహాన్ని వైఎస్ఆర్‌సిపి అధినాయ‌క‌త్వం ఎలా ఎదుర్కొంటుంద‌నేది వేచి చూడాల్సిందే…?

LEAVE A REPLY