నిర‌హార దీక్ష‌ల తెర వెనుక త‌మిళ‌తంబిలు ఆనందం

0
33

అమ‌రావ‌తిః రాజ‌కీయ పార్టీలు నిర‌హార దీక్ష‌లు చేస్తున్న‌రంటే ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు.ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్ మెంటు బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా నిన్న‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది.దీనిలో సీఎం పళనిస్వామి – డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మంత్రులు-ఎమ్మెల్యేలు-పార్టీ నేతలు జిల్లా ప్రధాన కార్యాలయాల్లో దీక్షకు కూర్చున్నారు.ఇదే దీక్షలో అధికార అన్నాడీఎంకే చేసిన కొన్ని పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే వెల్లూరు-కోయంబత్తూర్-సేలంలాంటి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు ముందు వేదికపై నిరాహార దీక్షకు కూర్చుంటూ.. వెనుక మాత్రం మంచిగా బిర్యానీ లాగించడం కెమెరాలకు చిక్కింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని ఇప్పటికే అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ వీడియోలు బయటకు రావడం మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది.నిరాహార దీక్షల వేదికలకు దగ్గరగానే ఈ మందు బిర్యానీ అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటికే విప‌క్షాలు మండిపడుతున్నాయి.

LEAVE A REPLY