ఆర్కేన‌గ‌ర్‌లో తెలుగువారు వుండ‌డం,విశాల్‌కు క‌లిసి వ‌స్తుందా.?

0
45

అమ‌రావ‌తిః అర్కే న‌గ‌ర్ ఉపఎన్నిక‌ల్లో తెలుగువాడు,తమిళ నటుడు అయిన విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా రంగంలోకి దిగారు.సొంతంగా పార్టీ పెడుతున్న విశాల్, పక్కా ప్రణాళితోనే విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్య‌నిస్తున్నారు. విశాల్ కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలను కలిసి వారి అభిప్రాయం తీసుకున్న తరువాతనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని, ఇప్పటికే విశాల్ పార్టీ పేరు,గుర్తు రెండూ కూడా ఏంటన్నది ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. విశాల్ పార్టీ పేరు అమ్మా ప్రజాపార్టీ… గుర్తు త్రిశూలం. విశాల్‌కు శక్తి స్వరూపిణి అమ్మవార్లంటే ఎంతో భక్తి. అందుకే విశాల్ సెంటిమెంట్‌గా ఈ గుర్తును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అమ్మా ప్రజా పార్టీ అనేది దేవత పేరు మీద వస్తుంది కాబట్టి తమిళ ప్రజలకు ఈ పార్టీ పేరు, గుర్తు బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని విశాల్ ఒక నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలుస్తుంది. 2021 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తెలుగువాడైన విశాల్‌ ఏకంగా అమ్మ జయలలిత స్థానంలో పోటీ చేయడంపై ఆర్కే నగర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి అతడికి ఓటు వేసి గెలిపిస్తారో లేదో చూడాల్సి వుంది.ఆర్కేన‌గ‌ర్ నియోజ‌వ‌ర్గంలో దాదాపు 1 ల‌క్ష మంది తెలుగువారు వుండ‌డం,విశాల్‌కు క‌లిసి వ‌స్తుందా..లేక 2021 వ‌ర‌కు పోరాటా చేయాల్సిందేనా అన్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలుస్తాయి..?

LEAVE A REPLY