భగవంతుడే న‌న్ను న‌డిపిస్త‌న్నాడు-బిజెపి కాదు-రజనీకాంత్

0
129

అమ‌రావ‌తిః సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయా పర్వతాల్లో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని మంగళవారం చెన్నై చేరుకున్నకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడించినట్లు మీరు అడుతున్నారని,అందుకే రాజకీయాల్లోకి వస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలపై మీరు ఏం సమాధానం చెబుతారు అని మీడియా ప్రశ్నించగా తన సత్తా తనకు తెలుసని,భగవంతుడు ఆడించినట్లు ఆడుతానే తప్పా ఎవరో ఆడించినట్లు తాను ఎందుకు ఆడుతానని రజనీకాంత్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.తమిళనాడులోని పుదుకోటై జిల్లాలో సోమవారం రాత్రి పెరియార్ విగ్రహం ద్వంసం చెయ్యడానికి కొందరు ప్రయత్నించిన విషయంపై రజనీకాంత్ మండిపడ్డారు. దేవుడి లాంటి పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చెయ్యాలనే ఆలోచన ఎలా వస్తోందని, అలాంటి పని చేసిన వారిని చూస్తూ వదిలిపెట్టకూడదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.తమిళనాడులో రామరాజ్య రథయాత్ర ప్రవేశించిన విషయంపై అయ‌న మాట్లాడుతూ తమిళనాడు ప్రజలు శాంతియుతంగా ఉంటారని,అల్లర్లకు పాల్పడరని,రామరాజ్య రథయాత్ర సవ్యంగా కొనసాగడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నానట్లు తెలిపారు.రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు అని మీడియా ప్రశ్నించగా తన అభిమాన సంఘాలు, జిల్లా నాయకులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తానని రజనీకాంత్ వివరించారు.

LEAVE A REPLY