డ్రోన్లు వినియోగంతో వ్య‌వ‌సాయం సుల‌భంగా చేసుకోవ‌చ్చు-సోమిరెడ్డి

0
186

నెల్లూరుః శాస్త్ర‌,సాంకేతిక ఆధునిక పరిజ్ఞానాన్ని ఉప‌యోగించి రైతుల‌కు క‌ష్టం త‌గ్గించి,ఆదాయాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకొవాడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.శుక్ర‌వారం స్దానిక వ్య‌వ‌సాయ‌ప‌రిశోధ‌న కేంద్రంలో డ్రోన్లు ఉప‌యోగంపై నిర్వ‌హించిన డెమో కార్య‌క్ర‌మంలో అయన ముఖ్యఅతిధిగా పాల్గొన్న సంద‌ర్బంలో మాట్లాడుతూ డ్రోన్లు ఉప‌యోగం ద్వారా పురుగుమందులను త‌గిని మోతాదులో పొలాల‌కు అందించ‌డంతో పాటు రైతుకూలీలు ఆనారోగ్యం భారీన ప‌డకుండా,మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా తోడ్ప‌డుతుంద‌న్నా అభిప్రాయం వ్య‌క్తం చేశారు.రెండున్న‌ర ఎక‌రాల పొలంలో కేవ‌లం 35 నిమిషాల్లో పురుగు మందుల‌ను పిచ‌కారిచేయ‌డం జ‌రుగుతుంద‌ని,అదేవిధంగా ఒక గంట‌లో 100 ఎక‌రాల మేర పురుగుమందులు వెద‌జ‌ల్లే విధంగా సాంకేతిక అభివృద్ది చెందింన్నారు.రైతు సంఘాల నాయ‌కుల అభ్య‌ర్ద‌న మేర‌కు రైతుభ‌వ‌న్ ఏర్పాటుకై స్ద‌లం అందించేందుకు అధికారుల‌తో చ‌ర్చించి చ‌ర్య తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,వ్య‌వ‌సాయ‌శాఖాధికారులు చంద్రానాయ‌క్‌,శివానార‌య‌ణ‌,రైతుల సంఘాల ప్ర‌తినిధులు కోటిరెడ్డి,ఓబుల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY