రిజ‌ర్వేష‌న్ కోటాను ఖ‌చ్చితంగా ఆమలు చేయాలి-శ్రావ‌ణ్‌కుమార్‌

0
8

నెల్లూరుః బాబా సాహెబ్ అంబెద్క‌ర్ క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ కోటాను షెడ్యూల్‌కులాల‌వారికి ఖ‌చ్చితంగా అమలు చేయని అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాస‌న స‌భ క‌మిటీ ఛైర్మ‌న్ టి.శ్రావ‌ణ్‌కుమార్ అన్నారు.గురువారం నూత‌న జ‌డ్పీ స‌మావేశ మందిరంలో జిల్లా అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ రిజ‌ర్వేష‌న్స్‌ను చిత్త శుద్దితో ఆమ‌లు చేయాల‌న్నారు.రోష్ట‌ర్ రిజిష్ట‌ర్స్ ఆమ‌లు చేయ‌డంతో జిల్లా యంత్రగం విఫ‌ల‌మైంద‌న్నారు. తొలుత ఉద‌యం ప్ర‌జ‌ల నుండి ఆర్జీలు స్వీక‌రించి,త‌దుప‌రి జ‌రిగిన స‌మావేశంలో స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించేవిధంగా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు ఎమ్మేల్సీ దీపక్‌రెడ్డి,ఎమ్మేల్యేలు టి.జ‌య‌రాములు, కిలివేటి.సంజీవ‌య్య‌,జెసి వెట్రిసెల్వి,ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీ పిహెచ్‌డి రామ‌కృష్ణ‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY