రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 10 మంది మృతి ?

0
118

అమ‌రావ‌తిః రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు వాత‌వార‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది.వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మ‌ర‌ణించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లా వాసులను ముంచెత్తింది.ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు ప‌డ‌డంతో జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు.పాతపట్నం మండలం తిడ్డిమిలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందగా, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం బస్టాండ్‌ వద్ద పిడుగుపడి ఇద్దరు యువకులు మృతి చెందారు.ఎల్‌.ఎన్‌.పేట మండలం పెద్దకొల్లివలసలో చెరువులో చేపలవేటకు వెళ్లిన అప్పలనర్సయ్య (55),కొమ్మివ‌ల‌స‌లో యువ‌తి పిడుగుపాటుకు మృతి చెందాడు. పాలకొండ, రేగిడి, వంగర, సంతకవిటి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.అలాగే మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరేపెల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున పిడుగుపడి ముగ్గురు రైతులు మృతిచెందారు. గ్రామానికి రాంటెంకి రాజయ్యతో పాటు మరో ఇద్దరు యువ రైతులు కుమ్మరి బాపు, జాడి రమేష్‌ తమ ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకునేందుకు శనివారం రాత్రి పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వర్షం తీవ్రం కావడంతో ధాన్యంతో పాటు కవర్లను కప్పుకున్నారు. తెల్లవారుజాము సమయంలో పిడుగు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.క‌డ‌ప జిల్లా ఖాజీపేట మండ‌లం బీచుప‌ల్లిలో పిడుగుపాట‌కు ఒక‌ మ‌హిళ మృతి,మ‌రో ఇద్దరు గాయాల‌పాలైయారు.

LEAVE A REPLY