వైభ‌వంగా ముక్కంటి ధ్వ‌జారోహ‌ణం

0
187

బ్ర‌హోత్స‌వాల‌కు దేవ‌గ‌ణానికి స్వాగ‌తం
శ్రీక‌ళాహ‌స్తీః శ్రీక‌ళాహ‌స్తీశ్వ‌రుని మ‌హాశివరాత్రి బ్ర‌హోత్స‌వాల్లో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం స్వామివారి ధ్వ‌జారోహ‌ణం అత్యంత వైభ‌వంగా జ‌రిగిది.మ‌హాశివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాల‌కు అష్ట‌దిక్పాల‌కుల‌ను,బ్ర‌హ్మా,విష్టువుల‌ను,స‌క‌ల దేవతా ముని గ‌ణాల‌ను ఆహ్వానిస్తూ ధ్వ‌జారోహ‌ణాన్ని నిర్వ‌హించారు.పుర‌విహ‌రం చేసిన పంచ‌మూర్తులు ఆల‌యంలోని స్వామివారి గ‌ర్బాల‌యంలో ముందు కొలువుదీర్చారు.వెండి అంబారీల్లో అధిష్టింప‌చేసిన స్వామి,అమ్మ‌వార్ల ముందు క‌ళ‌వ స్దాప‌న చేసి పూజ‌లు చేశారు.త్రిశూలానికి ప్ర‌త్యేక పూలు నిర్వ‌హించారు.హోమం వెలిగించి శాస్త్రోక్తతంగాపూజలు చేసి పూర్ణాహుతి స‌మ‌ర్పించారు.అనంత‌రం వృష‌భ ధ్వ‌జాన్ని ధ్వ‌జ‌స్తంభంపై ప్ర‌తిష్టించి ప్ర‌త్యేక పూలు చేసి స‌క‌ల దేవతా గ‌ణాల‌ను స్వాగ‌తించారు.ప‌న్నెండు రోజుల‌పాటు జ‌రిగే బ్ర‌హోత్స‌వాల్లో ఎటువంటి విఘ్నాలు జ‌ర‌గకుండా నిర్వ‌ఘ్నుంగా జ‌రిగేలా చూడ‌మంటు పూజించారు.క‌ర్పూర నీరాజ‌నాలు ఆర్పించారు.ఈ సంద‌ర్బంగా ఓంన‌మ‌శిఃవాయ నామ‌స్మ‌ర‌ణ‌లు మార్మోగాయి.అనంత‌రం మ‌ళ్లీ పంచూర్తులు పుర‌వీధుల్లో ఉరేగి భ‌క్తాదుల‌కు ద‌ర్శ‌మించారు.

LEAVE A REPLY