ముక్కంటి మ‌హాశివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

0
185

వైభ‌వంగా భ‌క్త‌క‌న్న‌ప్ప‌ ధ్వ‌జారోహ‌ణ‌
శ్రీక‌ళాహ‌స్తిః మాఘ‌బాహుళ అష్ట‌మినాడైన గుర‌వారం భ‌క్త‌క‌న్న‌ప్ప ధ్వ‌జారోహ‌ణంతో శ్రీక‌ళాహ‌స్తీశ్వ‌రుని మ‌హాశివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాల‌కు వైభ‌వంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.మేళతాళ‌ల నాదాల‌తో,వేద‌మంత్రోచ్చార‌ణ‌తో కైల‌స‌గిరులు మార్మోగి ప‌విత్ర‌మై,పావ‌న‌మై త‌రించాయి.ఆల‌య అధికారులు,ఆర్చ‌కులు,వేద‌పండితులు సాయంత్రం పూజాద్ర‌వ్యాల‌ను,సాంప్ర‌దాయ బ‌ద్దంగా ప‌ట్టు వ‌స్త్రాలు తీసుకుని శ్రీక‌ళాహ‌స్తీశ్వ‌రాల‌యానికి అనుకుని ఉండే కైలాస‌గిరి కొండ‌పై వెల‌సిన భ‌క్త‌క‌న్న‌ప్ప స‌న్నిధికి చేరుకున్నారు.వారి వెంట భ‌క్త‌క‌న్న‌ప్ప ఉత్స‌వ‌మూర్తిని ఉరేగింపుగా తీసుకొచ్చారు.ఎదురుగా క‌ల‌శ‌స్దాప‌న చేసి కొడివ‌స్త్రాల‌ను ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.వేద‌మంత్రోచ్చ‌ర‌ణ‌ల నడుమ పూజారుల మంత్ర‌ప‌ఠ‌నం సాగుతుండడా ధ్వ‌జ‌స్తంభంపైకి కొడి వ‌స్త్రాన్ని అధిరోహించారు.దీంతో భ‌క్త‌క‌న్ప‌ప్ప ధ్వ‌జ‌రోహ‌ణ కార్య‌క్ర‌మం అత్యంత వైభ‌వంగా నిర్వహించారు.

LEAVE A REPLY