జావెలిన్ త్రోలో బంగారం ప‌త‌కంను సొంతం చేసుకున్న నీర‌జ్‌

0
137

అమ‌రావ‌తిః అంత‌ర్జాతీయ క్రీడా వేదిక‌ల‌పై భార‌త్ యువ‌త త‌మ స‌త్తా చాటుతు,పసిడి ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకుంటున్నారు.ఇటీవలే ఫిన్‌లాండ్ వేదికగా హిమదాస్.. 400మీ పరుగు పందెంలో అందరికంటే ముందు రాణించి స్వర్ణం సంపాదించింది.మంగ‌ళ‌వారం ఫ్రాన్స్‌లో జరుగుతున్నసొట్టేవిల్లే అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా(20) పసిడి పతకాన్ని గెలుపొందాడు.ఈ సంవ‌త్స‌రం ఆస్ట్రేలియా‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి స్వర్ణ పతకాన్నిఅందించిన ఈ స్టార్‌ అథ్లెట్ తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌ ఫైనల్లో జావెలిన్‌ను రికార్డు స్థాయిలో (85.17 మీటర్లు) విసిరి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.ఛాంపియన్ చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్‌ త్రోయర్‌ ఆండ్రియన్ (81.48 మీటర్లతో) రజత పతకాన్నిగెలుపొందగా లితివేనియా అథ్లెట్‌ ఈడిస్ (79.31 మీటర్లతో) కాంస్య పతకం గెలుపొందారు.

LEAVE A REPLY