జాతీయ‌స్దాయి హాకీ క్రీడాకారులు రోడ్డుపై ధ‌ర్నా-దుస్దితికి కారణం DSDO-థామ‌స్‌

0
167

నెల్లూరుః జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడకారులు రోడ్డుపైకి వ‌చ్చి త‌ము రోజు వారి హాకీ ప్రాక్టీస్‌కు అనుమ‌తి ఇవ్వ‌లంటు స్టేడియం ముందు ధ‌ర్నా చేయాల్సి వ‌చ్చిందంటే ఇందుకు కార‌ణం ఏవ‌రు.? గ‌తంలో DSDOగా ప‌నిచేసిన అధికారి ప‌క్ష‌పాత వైఖ‌రితో జిల్లా హాకీ క‌నుమ‌రుగై దుస్దితికి తీసుకుని వ‌చ్చాడ‌ని,కొత్త‌గా బాధ్య‌తలు చేప‌ట్టిన సెట్‌నెల్ CEOని సైతం ప‌క్క‌దారి ప‌ట్టించాడ‌ని నెల్లూరు జిల్లా హాకీ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి థామ‌స్‌పీట‌ర్ ఆరోపించారు.శుక్రవారం స్దానిక ఏ.సి స్టేడియం వ‌ద్ద హాకీ క్రీడ‌కారులు ధ‌ర్నా చేయ‌డంతో,ప్ర‌స్తుతం క్రీడాభివృద్ది,సెట్‌నెల్ సిఇఓ అయిన సుబ్ర‌మ‌ణ్యం క‌లుగ‌చేసుకుని స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తాన‌ని మాట ఇవ్వ‌డంతో,క్రీడాకారులు ధ‌ర్నా విర‌మించారు.హాకీ క్రీడాకారుల‌కు జిల్లాలోని వివిధ క్రీడా సంఘ‌లు మ‌ద్దతు ఇచ్చాయి.బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ కార్యద‌ర్శి గాదం.శ్రీనివాసులు,అథ్లెటిక్స్‌అసోసియేష‌న్ కార్యద‌ర్శి ఆరిగెల‌.విజ‌య‌కుమార్‌, జిల్లా వ్యాయ‌మఉపాధ్యాయుల సంఘం అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులు కృష్ణ‌రెడ్డి,విక్ట‌ర్ త‌దిత‌రులు మ‌ద్దుతు పలికారు.

LEAVE A REPLY