ట్రాఫిక్ రూల్స్‌ పాటించకుంటే ఈ-చ‌లాన్‌,కేసులు-ఎస్పీ

0
138

నెల్లూరుః ఎం.వి యాక్ట్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని వారిపై పెనాల్టీ వ‌సూలు చేయ‌డం,ర‌సీదులు ఇవ్వ‌డం గ‌రువారం నుండి అపివేయ‌డం జ‌రిగింద‌ని,కేవ‌లం ఈ-చలాన్ మోషీన్ ద్వారా మాత్ర‌మే ఎం.వి యాక్ట్ 1998 ప్ర‌కార‌మే నోటీసులు,పెనాల్టీలు చెల్లించ వ‌ల‌సిన వాహ‌న యాజ‌మానికి వారి ఫోన్ నెంబ‌రుకు ఎస్‌.ఎం.ఎస్ ద్వారా తెలియ‌చేయ‌బ‌డుతుద‌ని జిల్లా ఎస్పీ ఐశ్వ‌ర్యరాస్తోగీ తెలిపారు.ఈ టెక్నాలజిని ఉప‌యోగించడం వ‌లన డేటాను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం,నేరానికి సంబంధించి వివార‌ర‌లు మార్చ‌డంతో పాటు ఎక్క‌డ అవినితికి వీలు లేకుండా వుంటుంద‌న్నారు.ఈ-చ‌లాన్ నగ‌దును మీ సేవా కేంద్రం ద్వారా కాని ఏ.పి ఈ-చ‌లాన్ ద్వారా కాని ప్లే స్టోర్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసికుని చెల్లించ‌వ‌చ్చాన్నారు.చ‌లాన్ చెల్లించ‌డంలో నిరాక‌రించినా,మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి త‌ర‌హా నేరాల‌కు పాల్ప‌డిన వారి వాహనాలు స్వాథీనం చేసుకుని వారి చ‌ట్ట రీత్యా చ‌ర్య‌లు తీసుకోవడం జ‌రుగుతుంద‌ని హెచ్చిరించారు.

LEAVE A REPLY