కొకైన్,LSD,MDMA(డ్రగ్స్)మాదక ద్రవ్యాలు స్వాధీనం-ఎస్పీ

(డ్రగ్స్),మాదకద్రవ్యాల గ్యాంగ్ ఆరెస్ట్

నెల్లూరు: ఇంజినీరింగ్,.ప్రోఫనల్ కోర్సులు చదువుతున్న యువకులు మెల్ల మెల్లగా (డ్రగ్స్),మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న ఘటన తాజాగా నెల్లూరు నగరంలో వెలుగులోకి వచ్చింది.సోమవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరాస్తోగీ తెలిపిన వివరాల మేరకు,,,నెల్లూరు నగరంలోని జెండా వీధికి చెందిన సాదిక్ (21) నగరంలోని రావూస్ కాలేజ్ లో BCA చదువుతున్నాడు.ఇతను డ్రగ్స్ కు ఆలవాటు పడడమే కాకుండా తన స్నేహితులకు డ్రగ్స్ ఆలవాటు చేశాడు.సాదిక్ డ్రగ్స్ కోసం చెన్నైలోని లక్ష్మినారాయణ,అతని ఫ్రెండ్ నవాజ్ ,,బెంగుళూరులోని నైజీరియన్లు అయిన శామ్యూల్.ఉచే,,యెహీరమ్.నునెస్ లను ఆన్ లైన్ లో వారి వద్ద నుండి డ్రగ్స్ కొనుగొలు చేస్తుండే వాడు.డ్రగ్స్ కు ఆలవాటు పడిన సాధిక్ తానే నాశనం అవాడమే కాకుండా తన స్నేహితులకు ఆలవాటు చేస్తున్నాడు..ఆన్ లైన్ వారి వద్ద నుండి కొనుగొలు చేసిన తరువాత,,వీరు స్వయంగా డ్రగ్స్ ను సాధిక్ కు అందచేసేవారు.వీరి కదలికపై నిఘా వుంచిన పోలీసులు సోమవారం ముత్తుకూరులోని గోపాలపరుం సెంటర్ వద్దటాయోటాకరోలాకారులోవస్తున్నలక్ష్మినారాయణ,నవాజ్,, నైజీరియన్లు శామ్యూల్.ఉచే,,యెహీరమ్.నునెస్ వీరి అదుపులోకి తీసుకుని,తనిఖీలు  చేయడంతో,,వీరి వద్ద నుండి కొకైన్, LSD, MDMA అనే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 1.04 Grams కొకైన్, 600 mgs-LSD, 900 mgs-MDMA మరియు MH-04 EQ 5402 కరోలా కారు  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.నగరంలో మరి కొంత మంది యువకులు డ్రగ్స్ వాడుతున్నట్లు విచారణ తేలిందని,యువకుల తల్లి,తండ్రులను పిలిపించి వారి పిల్లలు చెడు వ్యసనాలుకు బానిసలుగా మారితే జరగబోయో పర్యావ్యసనలనుతెలియ చేస్తామన్నారు.ఈ దాడుల్లో నెల్లూరు రూరల్ DSP BV. రాఘవరెడ్డి,KP పోర్ట్ CI ఖాజావలి,CI.I.శ్రీనివాసన్,KP.పోర్టు SIలు.శివ కృష్ణా రెడ్డి,బాబీ, శ్రీనివాసులు రెడ్డి,హనీఫ్,కానిస్టేబుల్స్ లను ఎస్పీ అభినందించారు.