తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి శెట్టిబలిజ వర్గం షాక్

0
154

అమ‌రావ‌తిః కోనసీమలో శెట్టిబలిజలకు వైసీపీ ప్రాధాన్యమివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తు, వైసీపీ కార్యక్రమాలకు శెట్టిబలిజ సామాజిక వర్గం దూరమైంది దీక్షా శిబిరాల్లో ఉన్న శెట్టిబలిజ కార్యకర్తలను స‌ద‌రు సామాజిక వర్గానికి చెందిన నేతలు తీసుకెళ్లిపోయారు.వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే శెట్టిబలిజ సామాజికవర్గం వైసీపీకి శాశ్వతంగా దూరమవుతుందని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్,కుడిపూడి చిట్టబ్బాయి హెచ్చరించారు.ఈ కమ్యూనిటియే తమ రాజకీయ ఎదుగుదలకు కారణమని,వారిని పట్టించుకోెకపోతే కష్టమన్నారు.శెట్టిబలిజ కమ్యూనిటి అండను పోగొట్టుకుని రాజకీయాల్లో తాము మనుగడ సాగించలేమని,వీరిని పొగొట్టుకుంటే తమను కనీసం పలకరించేవారు కూడా ఉండరని,అందువల్ల, శెట్టిబలిజ సంఘం నాయకుల మాటలను తాము కచ్చితంగా విని తీరాలని అన్నారు.వైసీపీలో శెట్టి బలిజలు కొనసాగుతున్నప్పటికీ తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని,తమకు న్యాయం జరిగే వరకు పార్టీ కార్యక్రమాలన్నింటిని తాత్కాలికంగా బహిష్కరిస్తామని ఆ సామాజిక వర్గం నాయకులు తెలిపారన్నారు.

LEAVE A REPLY