నోటు పుస్త‌కాల‌పై పెట్టుబ‌డి-కోట్ల‌రూపాయ‌ల‌ను కొల్ల‌కొట్ట‌వ‌చ్చు..

0
235

సుధాక‌ర్ మాహారాజ్ క్రైమ్ క‌థ స్కామ్ స్టోరీ-మొద‌టి భాగం
నెల్లూరుః 1000 రూపాయ‌లు డిపాజిట్ చేసి 1 పుస్త‌కాన్ని తీసుకుని,ఒక పేజిలో ఒక మంత్రాని 12 సార్లు చొప్పున రాయాలి,ఇలా 9 పేజిల్లో రాస్తే 108 సార్లు మంత్రం రాసిన‌ట్లు అవుతుంది.అప్ప‌డు పుస్త‌కం మ‌హారాజ్‌కు ఇస్తే,ఒక పుస్త‌కానికి 1000 డిపాజిట్ + 400 రూపాయ‌లు బోన‌స్ క‌ల‌పి 1400 రూపాయ‌లు.ఒక వ్య‌క్తి ఎన్ని పుస్తకాలు అయిన తీసుకోవ‌చ్చు,అయితే ప్ర‌తి పుస్త‌కానికి 1000 డిపాజిట్ క‌ట్టాలి.దిని పేరు న‌వ‌న‌గ ద‌త్త‌త్రేయ మ‌హాయాగం…అద్భుత‌మైన మ‌నీ స్కామ్‌..స్కామ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేష‌న్ కాపీరైట్స్ పూర్తిగా సుధాక‌ర్ మ‌హారాజ్‌కే చెందుతాయి..ఇందులో కొంత ప‌ర్సేంటేజ్ కొంత మంది రాజ‌కీయ నాయ‌కులకు చెందుతాయ‌ని గ‌మ‌నించ‌గ‌ల‌రు…
సుధాక‌ర్ మ‌హారాజ్ః– (ఓ సాధ‌ర‌ణ ఉపాధ్యాయుడు) ఇత‌నికి (అండ‌దండ) గ‌తంలో జిల్లాలో డి.ఇ.ఓగా ప‌నిచేసి ఓ ఆదికారి వున్న‌డ‌ని వినికిడి.సుధాక‌ర్ పి.ఏగా రాజ‌కీయ నాయ‌కుల వ‌ద్ద ప‌నిచేసిన స‌మ‌యంలో సినిమా రంగంలో చాలా మంది ప్ర‌ముఖులు అని చెప్ప‌బ‌డే వారితో పాటు కొంత మంది పెద్ద పెద్ద నాయ‌కులతో ఘ‌న‌మైన ప‌రిచ‌యాలు ఉన్న‌యన్న సంగ‌తి అంద‌కికి విదిత‌మే.
స్కామ్ ప్రారంభంః-గ‌త సంత్స‌రం న‌వంబ‌రు నెల చివ‌రి వ‌ర‌కు భ‌క్తులు అనేబ‌డే వారికి ఒక్క‌రికి ఒక పుస్త‌క‌మే,అదికూడా మ‌హారాజ్ చెప్పిన స‌మ‌యానికి తెచ్చి ఇస్తే,,ఎలాంటి డిపాజిట్ లేకుండా,,100 రూపాయ‌లు ఇచ్చేవాడు.ఈ ప‌థ‌కం పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు.ఇదే స‌మ‌యంలో మ‌హారాజ్ స్కామ్‌లోకి ప్ర‌వేశించిన ఒక టివి ఛాన‌ల్ విలేఖ‌రి,మ‌రో యంగ్ రాజ‌కీయ నాయ‌కుడు ఇత‌ను ఇటీవ‌లే అధికార పార్టీలోకి మారేడు,,మైపాడుగేటు ప్రాంతానికి చెందిన చోటా నాయ‌కుడు.వీరి ద్వారా రంగంలోకి దిగిన శ్రీనివాసులు,వాస‌వి…ఈ తంతు ప్రారంభం డిశంబ‌రు మొద‌టి వారంలో.అప్ప‌టి నుండి పుస్త‌కానికి 1000 రూపాయ‌లు డిపాజిట్ చేసి పుస్త‌కం పూర్తి చేసిన వారికి 400 రూపాయలు బోన‌స్ ఇస్తారు.ఇలా ఒక వ్య‌క్తి 50,100,200,300 ఇలా ఎన్ని పుస్త‌కాలైయిన ఇస్తారు.అయితే ప్ర‌తి పుస్త‌కానికి 1000 డిపాజిట్ క‌ట్టాలి.డిసెంబ‌ర్ నుండి 108 రోజుల పాటు న‌వ‌న‌గా ద‌త్త‌త్రేయ మ‌హాయ‌గం అద్బుత క్ష‌ణాలు ప్రారంభం,రాసిన వారికి రాసినంత భ‌క్తి,దానికి తోడు డ‌బ్బు అంటు,,,మ‌హారాజ్ కోట‌రీలో చేరిన టివి చాన‌ల్ విలేఖ‌రి,ఆశ్ర‌మం చుట్టు ప్ర‌క్కల ప్రాంతం,పార్టీ మారిన యువ‌నాయ‌కుడు చిన్న‌బ‌జారు త‌దిత‌ర ప్రాంతం,మైపాడు సెంట‌ర్ ప్రాంతానికి చెందిన నాయ‌కుడుకి స్టోన్‌హౌస్‌,నవాబుపేట త‌దిత‌ర పాంత్రాలను పంచుకుని,ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మం ముమ్మ‌రం చేశారు.దింతో ఒక్క సారి భ‌క్తులు అనేబ‌డే వారు నుండి పుస్త‌కాల‌కు డిపాజిట్‌ల వెల్లువ ప్రారంభంమైంది.ఒక్క రోజులో దాదాపు 20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్‌లు ప్ర‌జ‌లు క‌ట్టే వారంటే దిని బ‌ట్టి ఆర్దం చేసుకొవ‌చ్చు,స్కామ్ ఎంత చ‌క్క‌గా ఆమ‌లు చేశారో అన్న ఆంశం.భ‌క్తుల అన‌బ‌డే వారి సంఖ్య పెరిగిపొతుండ‌డం అదే స‌మ‌యంలో వారికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం పెరిగి పొయింది.దింతో ప్లాన్ *బి* ఆమ‌లు చేయ‌డం ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారంలో ప్రారంభించారు.ఇందులో భాగంగా 14వ తేదిన శ్రీనివాస్‌,వాస‌విలు ల్యాప్‌టాప్ ప్రాబెల‌మ్ వుంద‌ని ఒక‌రు టిఫిన్ చేసి వస్తాన‌ని మ‌రొక‌రు జ‌రుకోగా,ఛాన‌ల్ విలేఖ‌రి,చొటా నాయ‌కులు,పార్టీ మారిన నాయ‌కుడు తెల్ల‌వారీ జామునే జంప్‌…భ‌క్తులు అన‌బ‌డే ప్ర‌జ‌లు భౌతికంగా దాడి చేయ‌కుండా త‌ప్పించుకునేందుకు,,మ‌హారాజ్ ఆత్మ‌హ‌త్య య‌త్నం (ఇత‌నికి గతంలో గుండెకు స్టంట్ వేసి వున్న‌ట్లు బాధితులు చెప్పారు) చేశాడ‌ని,ఆసుప‌త్రిలో చేర్చారు…………మిగిలిన క‌థ రేపు రెండ‌వ భాగం అందిస్తాం….news19tv.com…………..మీకు తెలిసిన వివ‌రాలు,ఫోటోలు లేక వీడియోలు,,.news19tv@gmail.com పంపించ వచ్చు….అడ్మిన్‌…

LEAVE A REPLY