దుమ్ము లేపుతున్న సైరా మూవీ ట్రైలర్

అమరావతి: ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరీ మోగించిన రేనాటి వీరుడు నరసింహారెడ్డి జీవితచరిత్రను ‘సైరా’ చిత్రంగా కొణిదల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ రూపొందించారు.చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.ఇటీవలే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్లో హైలైట్ గా నిలించింది.