క్రీడ‌ల్లో రాష్ట్రం దేశంలో మొద‌టిస్దానంలో ఉంటుంది-శాప్ ఛైర్మ‌న్‌

0
104

నెల్లూరుః క్రీడకారులను ప్రోత్స‌హించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లతో,రాబోయే రోజుల్లో క్రీడ‌ల్లో రాష్ట్రం దేశంలో మొద‌టిస్దానంలో ఉంటుంద‌ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ద ఛైర్మ‌న్ పోలినేని.ఆంక‌మ్మ‌చౌద‌రి చెప్పారు.శనివారం స్దానిక ఏసి స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అసోసియేష‌న్స్‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం అయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న్వీక్ స్పోర్ట్స్ అకాడ‌మీ అనే ప్ర‌వేట్ క్రీడా శిక్ష‌ణ సంస్ద శాప్ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంద‌ని,సద‌రు సంస్ద‌కు విధి విధానాలు నిర్దేశించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క్రీడాల‌భివృద్ది కోసం దాదాపు 300 కోట్ల రూపాయ‌ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.ఆలాగే ఈసంవ‌త్స‌రం నుండి సి.ఎం క‌ప్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించనున్న‌ట్లు తెలిపారు. ఈస‌మావేశంలో జిల్లా ప్రాధికార సంస్ద చీఫ్ కోచ్ పి.వి.ర‌మ‌ణ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.
క్రీడా సంఘ‌లుః-శాప్ ఛైర్మ‌న్‌తో స‌మావేశమైన జిల్లాలోని వివిధ క్రీడ సంఘ‌లు త‌ము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అంక‌మ్మ‌చౌద‌రి దృష్టికి తీసుకుని వచ్చారు.స్కేటింగ్ పిల్ల‌ల‌కు గ‌త 18 సంవ‌త్స‌రాలు నేర్పిస్తున్న‌మ‌ని,అయితే క్రీడ‌కారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు స‌రైన వ‌స‌తులు స్టేడియంలో లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని,శాప్ ఛైర్మ‌న్ చొర‌వ‌తీసుకుని స్కేటింగ్ ఫీల్డ్‌ను నిర్మించి ఇవ్వాల‌ని స్కేటింగ్ జిల్లా సెక్ర‌ట‌రీ వెంక‌ట్ విజ్ఞ‌ప్తి చేశారు.అలాగే సాప్ట్‌బాల్ కూడా మైద‌నం లేద‌ని,స్టేడియంలో క్రీడ‌కారులు అడుకునేందుకు త‌గిన సౌక‌ర్యాలు కల్పించాల‌ని జిల్లా సాప్ట్‌బాల్ సెక్ర‌ట‌రీ రాజు కోరారు.

LEAVE A REPLY