ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామ‌కం

0
116

అమ‌రావ‌తిః ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంద‌ని శ‌నివారం నూత‌న డిజిపి ఆర్‌.పి.ఠాకూర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్బంలో చెప్పారు.ప్ర‌తి నెల ఒక కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి వాళ్ల క‌ష్ట‌సుఖ‌లు తెలుసుకుని,ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని,రాష్ట్రంలో రౌడియిజం లేకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.టెక్నాలాజీని ఉప‌యోగించ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్దానంలో ఉంద‌ని,బ‌ల‌మైన పోలీసు వ్య‌వ‌స్ద రాష్ట్రనికే సొంత‌మ‌న్నారు.త‌నపై న‌మ్మ‌కం ఉంచి బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త డీజీపీగా ఠాకూరు నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆర్పీ ఠాకూరు ప్రస్తుతం అవినితి నిరోధ‌క శాఖ‌ డీజీగా పనిచేస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి అయిన ఠాకూరు,, ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూరు పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌.ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ చదివారు.1986 డిసెంబర్‌ 15న ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో ASPగా ఆయన తొలి నియామకం జరిగింది.గుంటూరు,వరంగల్‌ జిల్లాల్లో ASPగా, పశ్చిమగోదావరి,కడప,కృష్ణా,వరంగల్‌ జిల్లాల SPగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్‌ హైదరాబాద్‌ DCPగా, అనంతపురం,చిత్తూరు జిల్లాల DIGగా బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ DG గా పనిచేశారు.2016 నవంబర్‌ 19 నుంచి రాష్ట్ర అవినితి నిరోధ‌క శాఖ‌ DG గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

LEAVE A REPLY